భారీ బడ్జెట్, యాక్షన్ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి కొనసాగుతున్నప్పటికీ.. రాబోయే రెండు నెలల్లో టాలీవుడ్లో పలు క్యూట్ లవ్ స్టోరీస్ సందడి చేయనున్నాయి. మిడ్రేంజ్, యువ హీరోలతో తెరకెక్కిన ఈ సినిమాలు విభిన్నమైన ప్రేమకథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
అక్టోబర్ 2న హర్ష్ రోషన్ నటించిన ‘తెల్ల కాగితం’ విడుదల కానుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి గల్లా అశోక్, గౌరీప్రియ జంటగా నటించిన ‘వీసా’ కూడా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఉద్భవ్ దర్శకత్వం వహించారు. ఇక ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న యూవీ క్రియేషన్స్ నుంచి ‘రోమియో జూలియట్’ విడుదలకు సిద్ధమవుతోంది.
అక్టోబర్ చివరి వారంలో ఒకే రోజున రెండు ప్రేమకథా చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నాయి. అక్టోబర్ 30న సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వం వహించిన రోషన్ మేక సినిమా ‘ఏమో ఏమో ఇది’ విడుదల కానుంది.
అదే రోజున అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన ‘ఇట్లు అర్జున’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ యాక్షన్ సినిమాల మధ్యలో వరుసగా వస్తున్న ఈ క్యూట్ లవ్ స్టోరీస్ యువతను, ఫ్యామిలీ ఆడియన్స్ను ఎంతవరకు ఆకట్టుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.








