భారత్‌లోకి Apple Pay ఎంట్రీ..

భారత్‌లోకి Apple Pay ఎంట్రీ..

Summarize with AI

భారత్‌లో Apple Pay సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో iPhone, iPad, Apple Watch వినియోగదారులు ఇకపై కార్డును బయటకు తీయాల్సిన అవసరం లేకుండానే స్టోర్లు, యాప్స్, వెబ్‌సైట్లలో చెల్లింపులు చేయవచ్చు. ప్రారంభ దశలో Axis Bank జారీ చేసే Visa, Mastercard క్రెడిట్ కార్డులను Apple Payలో యాడ్ చేసుకునే అవకాశం కల్పించారు. కార్డును Apple Walletలో జోడించిన తర్వాత.. స్టోర్‌లోని కాంటాక్ట్‌లెస్ పేమెంట్ మెషీన్ వద్ద iPhone లేదా Apple Watchను ట్యాప్ చేస్తే చెల్లింపు పూర్తవుతుంది. ప్రత్యేకంగా PIN లేదా OTP టైప్ చేయాల్సిన అవసరం లేకపోవడం ఈ సేవలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. Apple Storeతో పాటు Blinkit, Croma, Zomato, Tata 1mg, Ixigo, Reliance బ్రాండ్స్ తదితర ప్రముఖ సంస్థల వద్ద Apple Payతో చెల్లింపులు చేసుకోవచ్చు.

భద్రత, గోప్యతకు ప్రాధాన్యం ఇస్తూ Apple Payను రూపొందించినట్లు Apple తెలిపింది. వినియోగదారుల అసలు కార్డు నంబర్‌ను డివైస్‌లో లేదా Apple సర్వర్లలో నిల్వ చేయకుండా, ప్రతి కార్డుకు ప్రత్యేకమైన Device Account Numberను రూపొందించి Secure Elementలో భద్రపరుస్తారు. స్టోర్లలో చెల్లించేటప్పుడు Face ID, Touch ID లేదా పాస్‌కోడ్ ద్వారా ధృవీకరణ పూర్తయిన తర్వాత డివైస్‌ను కాంటాక్ట్‌లెస్ టెర్మినల్‌కు దగ్గరగా ఉంచితే సరిపోతుంది. Axis Bank యాప్ లేదా iPhoneలోని Wallet యాప్ ద్వారా అర్హత ఉన్న కార్డులను Apple Payలో యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం iPhone, iPad, Apple Watchలో సేవలు అందుబాటులో ఉండగా.. Macకు సపోర్ట్ త్వరలో రానుంది. దీంతో భారత్‌లో డిజిటల్ పేమెంట్స్‌లో Apple Pay మరో కొత్త చెల్లింపు మార్గంగా అందుబాటులోకి వచ్చింది.

Join WhatsApp

Join Now

Leave a Comment