అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు

అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు

Summarize with AI

అట్టికా గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించిన అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు భారీగా సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద హైదరాబాద్‌, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైలోని మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. కంపెనీ కార్యాలయాలు, డైరెక్టర్లు, షేర్‌హోల్డర్లు, మాజీ డైరెక్టర్లు, అనుబంధ సంస్థల కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు జరిగాయి.

పలు పోలీస్‌ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. దొంగతనం చేసిన బంగారాన్ని నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి, తద్వారా నేర ఆదాయం సమకూర్చుకున్నారనే ఆరోపణలపై అధికారులు దృష్టి సారించారు. ఈ లావాదేవీల వెనుక ఉన్న వ్యక్తులు, హవాలా మార్గాలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

రెండు రోజుల పాటు సాగిన సోదాల్లో రూ.7.52 లక్షల నగదుతో పాటు విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. కొందరు కీలక వ్యక్తులు, డైరెక్టర్లు విచారణకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఆధారాల ఆధారంగా దర్యాప్తును కొనసాగిస్తూ, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment