24 ఏళ్ల యువకుడిగా మహేశ్‌బాబు.. కొత్త లుక్ వైరల్!

24 ఏళ్ల యువకుడిగా మహేశ్‌బాబు.. కొత్త లుక్ వైరల్!

Summarize with AI

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎస్‌ కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, సినిమాలోని ఓ కీలక ఎపిసోడ్‌లో మహేశ్‌బాబు 24 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను మహేశ్‌ ఇప్పటికే పూర్తి చేసినట్లు, త్వరలో డబ్బింగ్‌ పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, తాజాగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్‌బాబు క్లీన్‌ షేవ్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానుల దృష్టి ఆయన లుక్‌పైనే పడింది. కెమెరా వైపు చూస్తూ మహేశ్‌ చిరునవ్వుతో కనిపించడంతో.. ‘వారణాసి’లోని 24 ఏళ్ల యువకుడి పాత్ర కోసమే ఈ క్లీన్‌ షేవ్ లుక్‌ను మెయింటైన్ చేస్తున్నారా? అనే చర్చ మొదలైంది. అయితే ఈ లుక్‌ నిజంగా సినిమాలోని పాత్ర కోసమేనా, లేక సాధారణంగానే మహేశ్‌ ఈ స్టైల్‌లో కనిపించారా అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది. మొత్తంగా మహేశ్‌ కొత్త లుక్‌ ‘వారణాసి’పై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment