బాబు-పవన్ ఫొటో.. ‘ఈనాడు’ తాప‌త్ర‌యం ఇదేనా..?

బాబు-పవన్ ఫొటో.. 'ఈనాడు' తాప‌త్ర‌యం ఇదేనా..?

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు (Local Body Elections) అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం(Telugu Desam Party), జనసేన పార్టీల(Jana Sena Party) మధ్య సీట్ల మంటలు రాజేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు, ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్ వార్‌) (Cold War) సాగుతుంటే.. కూటమి అంతా ‘ఆల్ ఈజ్ వెల్’(All Is Well) అని రంగుల బొమ్మ చూపేందుకు టీడీపీ అనుకూల పత్రిక ‘ఈనాడు’ (Eenadu) పడరాని పాట్లు పడుతోందని రాజ‌కీయ పండితుల అభిప్రాయం.

కేబినెట్ మీటింగ్ వార్తకు అందుకు సంబంధించిన ఫొటోలకు బదులుగా.. చంద్రబాబు(Chandrababu Naidu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమావేశానికి నడిచివస్తున్న ఫోటోను హైలైట్ చేసిన తీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ బలం ఉన్న స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన క్యాడర్ (Jana Sena Cadre) ఉవ్విళ్లూరుతోంది. అయితే, జనసేనకు కేవలం 15 శాతం సీట్లు మాత్రమే కేటాయిస్తామంటూ నారా లోకేష్(Nara Lokesh) వాటా తేల్చేశారనే వార్తలు జనసేన శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చాయి.

ఈ పరిణామాలపై ఇటీవల కాకినాడ (Kakinada) వేదికగా జరిగిన సభలో పవన్ కల్యాణ్ బహిరంగంగానే తీవ్రంగా స్పందించారు. “సీట్లు అనేవి ఎవరో ఇచ్చే బిచ్చం కాదు.. మన స్వశక్తితో సాధించుకుందాం” అంటూ జ‌న‌సేన క్యాడ‌ర్ మీటింగ్‌లో తెగేసి చెప్పేశారు. ఈ వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాల‌ను స్పష్టంగా ఎండగట్టాయి. అంత‌కు ముందు క్షేత్రస్థాయిలో సీట్ల కేటాయింపుపై జ‌న‌సేన ద్వితీయ శ్రేణి క్యాడ‌ర్ కూడా త‌మ నిరాశ‌ను వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా, కూటమిలో పొరపొచ్చాలు లేవని, అంతా స‌వ్యంగానే ఉంద‌ని ప్రజలను, ఆయా పార్టీల కార్య‌క‌ర్త‌ల‌ను నమ్మించేందుకు టీడీపీ(TDP) అనుకూల‌ పత్రిక ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల ఫోటో హైలైట్ చేస్తూ వార్త అచ్చేసింది. అంతర్గత విభేదాలు, సీట్ల తగాదాలు ఇప్పటికే ప్రజలకు, పత్రికా ప్రతినిధులకు పూసగుచ్చినట్లు తెలిసిపోయాయి. కాకినాడ సభలో పవన్ మాట్లాడిన మాటలు ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయాయి.

అసలు కథంతా ముగిసిపోయాక, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పేందుకు టీడీపీ అనుకూల మీడియా తాప‌త్ర‌య‌ప‌డుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎన్ని వార్త‌లు వండి వార్చినా.. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య రగులుతున్న అసంతృప్తిని ఆపడం సాధ్యం కాదంటున్నారు. స్థానిక సంస్థ‌ల సీట్ల పంపకాలపై జరుగుతున్న తొక్కిసలాట కూటమిలో ఏర్పడిన చీలికలను ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment