రామ్ చరణ్–సుకుమార్ ‘RC17’కు ముహూర్తం ఖరారు..

రామ్ చరణ్–సుకుమార్ ‘RC17’కు ముహూర్తం ఖరారు..

Summarize with AI

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ RC17 . ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో.. ప్రేక్షకులు, అభిమానుల్లో అనౌన్స్మెంట్‌ (Announcement) నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా పుష్ప2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో.. యావత్ ప్రపంచం ఆర్సీ 17 అప్డేట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు సుక్కు.

అయితే ఈ సినిమా ఓపెనింగ్ ఇప్పుడాని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందుకోసం కోసం ముహూర్తం (Muhurat) ఫిక్స్ చేశారట మేకర్స్. ఈ ఈఏడాది అక్టోబర్ 20 అనగా విజయదశమి (Vijayadashami) శుభ ముహూర్తాన ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు (Pooja Ceremony) ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ దసరా పండుగ వేళ ‘RC17’ అధికారిక ప్రారంభోత్సవంతో అభిమానులకు మేకర్స్ ఒక బిగ్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. దసరా నాడు గ్రాండ్‌గా పూర్తి చేసి.. నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ (Regular Shooting) ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతుండటంతో షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers), సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా పలువురి పేరులు వినిపిస్తున్నాయి. విజయదశమి నాడే ఈ సినిమా గ్రాండ్ లాంచ్‌తో పాటు రెగ్యులర్ షూటింగ్ మరియు కీలకమైన కాస్టింగ్ డీటైల్స్‌పై మేకర్స్ ప్రకటన చేసే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment