ఇంటింటికీ పెన్షన్ (Pension) పంపిణీ నిలిచిపోయి.. అర్హులందరూ సచివాలయాల (Secretariats) వద్దే పెన్షన్ కోవాలనే అధికారుల రూల్ ఓ వృద్ధురాలి (Elderly Woman) ప్రాణం తీసింది. పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లేందుకు బయల్దేరిన ఓ వృద్ధురాలిపై ఆవు (Cow) దాడి చేయడంతో ఆమె మృతి చెందారు. అనంతపురం జిల్లా(Anantapur District) వజ్రకరూరు మండలం (Vajrakarur Mandal) కొనకొండ్లలో(Konakondla) చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కొనకొండ్ల గ్రామానికి చెందిన నెట్టికంటమ్మ పెన్షన్ కోసం సచివాలయానికి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఆవు (Cow) ఆమెపై దాడి చేసింది. ఆవు దాడిలో తీవ్రంగా గాయపడిన నెట్టికంటమ్మను స్థానికులు వెంటనే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వృద్ధురాలిపై దాడి చేసిన అనంతరం కూడా ఆవు శాంతించలేదు. గ్రామంలో మరికొందరిపై దాడికి యత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆవు (Cow) నుంచి తప్పించుకునేందుకు పలువురు పరుగులు తీశారు. అనంతరం స్థానికులు ఆవును పట్టుకునేందుకు వెంబడించారు.
ఈ క్రమంలో ఆవు కూడా పరుగులు తీస్తూ కిందపడిపోయినట్లు స్థానికులు తెలిపారు. చివరకు పరిగెత్తుతూ కిందపడిన ఆవు మృతి చెందింది. ఇటీవలే ఈ ఆవును ఓ పిచ్చికుక్క కరిచినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో ఆవు అసహజంగా ప్రవర్తించిందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అనంతపురం జిల్లా కొనకొండ్లలో ఆవు బీభత్సం
— Telugu Feed (@Telugufeedsite) September 1, 2026
పెన్షన్ కోసం సచివాలయం వెళ్తున్న నెట్టికంటమ్మ అనే వృద్ధురాలిపై ఆవు దాడి
తీవ్రగాయాలతో మృతిచెందిన నెట్టికంటమ్మ
మరికొందరిపై దాడికి యత్నించిన ఆవు.. స్థానికులను పరుగులు
పరిగెత్తి… పరిగెత్తి కిందపడి చనిపోయిన ఆవు
ఇటీవలే ఆవును పిచ్చి కుక్క… pic.twitter.com/dAJf6Z3Hbr







