మహిళల ఆసియా కప్‌లో భారత్ బోణీ.. థాయ్‌లాండ్‌పై ఘన గెలుపు

మహిళల ఆసియా కప్‌లో భారత్ బోణీ.. థాయ్‌లాండ్‌పై ఘన గెలుపు

Summarize with AI

మహిళల ఆసియా కప్‌ 2026లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన గ్రూప్‌-A మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను 94 పరుగుల భారీ తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ 36 బంతుల్లో 64 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడింది. ఆమె ఖాతాలో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. స్మృతి మంధాన 19, ప్ర‌తికా రావల్ 22 పరుగులు చేశారు. అయితే 108/2తో పటిష్ఠ స్థితిలో ఉన్న భారత్.. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 137/9కు చేరుకుంది. చివర్లో క్రాంతి గౌడ్ 8 బంతుల్లో 15 పరుగులు చేయడంతో భారత్ 159 పరుగులకు చేరుకుంది. థాయ్‌లాండ్ తరఫున సులీపోర్న్ లావోమీ 3 వికెట్లు తీసింది.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ భారత బౌలర్ల ధాటికి ఏమాత్రం నిలవలేకపోయింది. 16.1 ఓవర్లలో కేవలం 65 పరుగులకే ఆలౌటైంది. నన్నపట్ కొంచరోఎంకై 41 పరుగులతో ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో నందిని శర్మ 4 ఓవర్లలో 18 పరుగులకు 3 వికెట్లు, శ్రీ చరణి 2/10, దీప్తి శర్మ 1.1 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా దీప్తి శర్మ కేవలం 7 బంతుల్లో 3 వికెట్లు తీసి 0 పరుగులు ఇవ్వడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment