దూసుకెళ్తున్న కాన్వాయ్‌కు పుతిన్ బ్రేక్.. ప్రజలతో కలిసి ఫొటోలు, వీడియో వైరల్

దూసుకెళ్తున్న కాన్వాయ్‌కు పుతిన్ బ్రేక్.. ప్రజలతో కలిసి ఫొటోలు, వీడియో వైరల్

Summarize with AI

రష్యా అధ్యక్షుడు (Russian President) పుతిన్ (Vladimir Putin) సెక్యూరిటీ ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఆయన కాన్వాయ్ (Convoy) వెళ్తుంటే పూర్తి బందోబస్త్ మధ్య వెళ్తుంటారు. అలాంటి భద్రతలో ఉన్న పుతిన్.. ఆశ్చర్యం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. వేగంగా దూసుకెళ్తున్న కాన్వాయ్‌ను అకస్మాత్తుగా ఆపి.. రోడ్డు ప్రక్కన ఉన్న ప్రజలతో(Public) మమేకం అయి ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

పుతిన్ ఆగస్టు 11న సైబీరియాలోని(Siberia) నోవోసిబిర్స్క్(Novosibirsk) నగరంలో పర్యటించారు. పుతిన్ కాన్వాయ్ వేగంగా దూసుకుపోతుంది. కొంత మంది పౌరులు రహదారి పక్కన నిశ్శబ్దంగా వీడియో రికార్డ్ చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా అద్భుతం జరిగింది. డజన్ల కొద్దీ వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్డు ప్రక్కన ఆగిపోయాయి. నల్లటి విలాసవంతమైన కార్లు, భద్రతా వాహనాల నుంచి అంగరక్షకులు కిందకు దిగారు. పుతిన్ స్వయంగా కారు దిగి జనసమూహంతో ముచ్చటించడం ప్రారంభించారు. వారితో రష్య భాషలో(Russian Language) సంభాషిస్తూ కనిపించారు. పుతిన్ షర్టు, టై ధరించి ఉన్నారు. వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి దగ్గరకు నేరుగా నడుచుకుంటూ వచ్చారు. పుతిన్ రాకతో ఆ వ్యక్తి ఆశ్చర్యానికి గురయ్యాడు. కొన్ని వారాల క్రితం నాటి పుతిన్ వీడియోను రష్యా టుడే తన ఎక్స్-మెన్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రజలు దానిని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment