నేచురల్ స్టార్ నాని(Nani), కీర్తి సురేశ్ (Keerthy Suresh) జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’(The Paradise). దసరా సూపర్ హిట్ సినిమా తరువాత శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో నాని నటిస్తున్న రెండో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి ‘యేషనాగుల కట్టమీద’(Yeshanagula Kattamida) వీడియో సాంగ్‌ను మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేశారు.
మాస్ బీట్లతో సాగుతున్న ఈ పాటలో నాని, కీర్తి సురేశ్ వేసిన ఊరమాస్ స్టెప్పులు (Mass Dance Steps) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) అందించిన మ్యూజిక్ పాటకు మరింత జోష్‌ను తీసుకొచ్చింది. జంగి రెడ్డి(Jangi Reddy), ప్రభ ఆలపించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ (Kasarla Shyam) సాహిత్యం అందించారు.
పాటలో నాని, కీర్తి సురేశ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. మాస్ బీట్‌కు తగ్గట్టుగా కొరియోగ్రఫీ ఉండటంతో ఈ సాంగ్ థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే ‘ది ప్యారడైజ్’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా.. తాజాగా విడుదలైన ‘యేషనాగుల’(Yeshanagula) సాంగ్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.








