బ్యూటీ ట్రీట్‌మెంట్ కోసం కొడుకు రక్తం!

బ్యూటీ ట్రీట్‌మెంట్ కోసం కొడుకు రక్తం!

కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన 47 ఏళ్ల మార్సెల‌ ఇగ్లేసియా (Marcela Iglesias) తన యవ్వన రూపాన్ని కాపాడుకోవడానికి వినూత్న‌మైన విధానం అనుసరిస్తున్నారు. “హ్యూమన్ బార్బీ” అని పిలవబడే ఈమె, తన 23 ఏళ్ల కొడుకు రోడ్రిగో రక్తాన్ని బ్యూటీ ట్రీట్‌మెంట్ కోసం వినియోగిస్తున్నట్లు చెప్పి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇగ్లేసియా మాట్లాడుతూ.. రక్త మార్పిడి (బ్ల‌డ్ ట్రాన్స్‌ఫ్యూజ‌న్‌) ద్వారా శరీరంలోకి తాజా రక్తం ప్రవేశించి అందం మెరుగుపడుతుందన్నారు. తన యవ్వన రూపాన్ని కాపాడుకోవడానికి తన 23 ఏళ్ల కుమారుడి నుండి రక్తం ఎక్కించుకుంటున్నాన‌ని తెలిపింది. తన బ్యూటీ ట్రీట్‌మెంట్ కోసం తన కొడుకు రక్తాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని, అతను తన అమ్మమ్మ కోసం కూడా బ్ల‌డ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడ‌ని ఇగ్లేసియా పేర్కొంది.

బార్బీలా కనిపించేందుకు మార్సెలా ఇప్పటి వరకు రూ.85 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ వినూత్న పద్దతి శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుందా? లేక కేవలం సౌందర్యం కోసం మితిమీరిన ప్రయత్నమా? అని పలువురు ఆసక్తిగా చర్చిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment