ప్రేమను వ్యక్తపరచడానికి ఎవరి పద్ధతులు వారివి. కొందరు తమ భావాలను మాటల్లో చెబితే, మరికొందరు వినూత్నంగా తమ ప్రేమను చాటుకుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఒక ప్రియురాలు తన బాయ్‌ఫ్రెండ్ కారుపై ముద్దుల వర్షం కురిపించింది. ఈ వినూత్న ప్రేమ లేఖ ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగింది?
వైరల్ అవుతున్న వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక యువతి తన ప్రియుడిపై ఉన్న గాఢమైన ప్రేమను అందరికీ విభిన్నంగా చూపించాలనుకుంది. దీనికోసం ఆమె తన ప్రియుడు నడిపే కారును ఎంచుకుంది. లిప్‌స్టిక్ పెట్టుకుని, ఆ కారు అద్దాలపై, బాడీపై ముద్దులతో నింపేసింది. ఏకంగా 3400 ముద్దులతో కారును నింపేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఏకంగా రూ.5,500 ఫైన్ విధించడం గమనార్హం.
నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన
ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఇదే అసలైన ప్రేమ!” అంటూ కొందరు రొమాంటిక్ కామెంట్లు చేస్తుంటే.. “కారు క్లీన్ చేయడం ఆ బాయ్‌ఫ్రెండ్‌కి పెద్ద పనే!” అంటూ మరికొందరు సరదాగా జోకులు పేలుస్తున్నారు.
ఈ తరహా ట్రెండ్స్ గతంలోనూ విదేశాల్లో కనిపించగా, ఇప్పుడు మన దేశంలోనూ ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయని చర్చించుకుంటున్నారు. ప్రేమను చూపించడంలో ఈ యువతి ప్రదర్శించిన సృజనాత్మకత ఏంటో గానీ, ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
Love left 3,500 lipstick marks on a boyfriend’s car and a ₹5,500 fine followed! 💋💀
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2026
A woman reportedly covered her boyfriend’s car with kiss marks, prompting Madhya Pradesh Police to issue a fine. All the marks were later removed. pic.twitter.com/102W0vC2rL








