ఇరుముడి సినిమాలో ఆ సన్నివేశాలు తొలగించండి

ఇరుముడి సినిమాలో ఆ సన్నివేశాలు తొలగించండి

Summarize with AI

లాంగ్ గ్యాప్ త‌రువాత భారీ హిట్ కొట్టారు మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌ (Ravi Teja). ఇరుముడి (Irumudi) సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. భారీ క‌లెక్ష‌న్ల (Huge Collections) దిశ‌గా దూసుకెళ్తున్న సినిమాపై ఉపాధ్యాయ సంఘాలు (Teachers’ Associations) అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలు(Government Schools), ఉపాధ్యాయుల గౌరవాన్ని (Teachers Respect) దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలను(Scenes) ‘ఇరుముడి’(Irumudi) సినిమా నుంచి వెంటనే తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య డిమాండ్ చేసింది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని పాత్రను ప్రతికూలంగా చిత్రీకరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

‘ఇరుముడి’ సినిమాలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయిని పాత్రను ప్రతికూలంగా చూపించే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య పేర్కొంది. ఈ సన్నివేశాలు ఉపాధ్యాయ వృత్తిని అవమానించేలా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది.

సినిమాలో చూపించిన సన్నివేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు ప్రభుత్వ పాఠశాల కనిపిస్తుందని ఉపాధ్యాయ సమాఖ్య తెలిపింది. అంతేకాకుండా ఆ సన్నివేశాల్లో విద్యార్థులు ధరించిన యూనిఫామ్‌ కూడా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ధరిస్తున్న యూనిఫామ్‌తో ఒకే విధంగా ఉందని పేర్కొంది.

సన్నివేశాల్లో పాఠశాల, విద్యార్థుల యూనిఫామ్(Students’ Uniform), ఉపాధ్యాయిని పాత్రను చూపించిన తీరు కారణంగా వీటిని కేవలం కల్పిత పాత్రలు, కల్పిత పరిస్థితులుగా భావించలేమని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య అభిప్రాయపడింది. ప్రభుత్వ పాఠశాలలను, అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరించడం సరికాదని పేర్కొంది.

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలను సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవాన్ని కాపాడేలా చిత్ర బృందం వెంటనే స్పందించాలని కోరింది. ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను ప్రతికూలంగా చూపించే సన్నివేశాలపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, వివాదాస్పద సన్నివేశాలను తొలగించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment