జూ.ఎన్టీఆర్ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం.. హెల్త్ బులెటిన్ విడుదల

జూ.ఎన్టీఆర్ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం.. హెల్త్ బులెటిన్ విడుదల

Summarize with AI

ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు (Jr NTR) హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో(KIMS Hospital) భుజానికి శస్త్రచికిత్స(Surgery) విజయవంతంగా పూర్త‌యింది. భుజానికి గాయంతో(Shoulder Injury) కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఆయనకు వైద్యుల సూచన మేరకు ఇవాళ సర్జరీ నిర్వహించారు.

జూనియర్ ఎన్టీఆర్‌కు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తైనట్లు కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. డాక్టర్ ఆర్.ఎ. పూర్ణచంద్ర తేజస్వి(Dr. R.A. Purnachandra Tejaswi), డాక్టర్ నితిన్ బెజ్జంకి(Dr. Nithin Bejjanki), డాక్టర్ మధుసూదన్ రావు(Dr. Madhusudan Rao), డాక్టర్ శ్రీనివాస్ రావు సురపనేని (Dr. Srinivas Rao Surapaneni) నేతృత్వంలోని ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన పూర్తి క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్‌కు త్వరలోనే ప్రత్యేక రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్(Rehabilitation Program) ప్రారంభించనున్నట్లు కిమ్స్ వెల్లడించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు అవసరమైన చికిత్స, వ్యాయామాలను వైద్యుల పర్యవేక్షణలో అందించనున్నారు.

దాదాపు 2 నుంచి 3 నెలల వ్యవధిలో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి వస్తారని వైద్యులు అంచనా వేస్తున్నారు. తొలుత 6–8 వారాల పాటు విశ్రాంతి అవసరమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్‌కు సర్జరీ విజయవంతం కావడంతో ఆయన అభిమానులు, సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment