“పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు”.. BRS మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు..

“పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు”.. BRS మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు..

Summarize with AI

బీఆర్‌ఎస్(BRS) నేత, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావుపై (Rega Kantha Rao) పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించి (Sexually Harassing), మోసం చేశారంటూ ఓ యువతి (Young Woman) నాంపల్లిలోని గౌరవ XIV అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును (Metropolitan Magistrate Court) ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. ఆమె నగరంలో ఓ పీజీలో నివసిస్తూ మీడియా రంగంలో పనిచేస్తోంది. 2022లో ఓ ఇంటర్వ్యూ నిమిత్తం రేగా కాంతా రావుతో పరిచయం ఏర్పడింది. కొత్త యూట్యూబ్ ఛానల్ నిర్మాణం పేరుతో మొదలైన ఈ పరిచయం, పెళ్లి చేసుకుంటాననే హామీతో క్లోజ్ రిలేషన్‌షిప్‌గా మారింది. అమీర్‌పేటలోని ఓ ఫ్లాట్‌లో కొన్నాళ్లు సహజీవనం చేసినట్లు, ఈ క్రమంలో తన అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.

అంతేకాకుండా, రియల్ ఎస్టేట్‌లో (Real Estate) పెట్టుబడి పేరుతో తన వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకుని, ఆ తర్వాత నుంచి ముఖం చాటేశారని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఈ విషయంపై ఒత్తిడి తేగా, ఆయన అనుచరుల ద్వారా కొన్ని విడతలుగా రూ.8.5 లక్షలు బదిలీ చేసినప్పటికీ, తన సమస్య కేవలం డబ్బుకు సంబంధించింది కాదని.. నాలుగేళ్ల పాటు పెళ్లి పేరుతో మోసం చేసి శారీరకంగా దోపిడీ చేయడమేనని స్పష్టం చేసింది. గతంలో షీ టీమ్స్‌కు (She Teams) ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినా, రేగా కాంతా రావు తనపై ఎదురు ఆరోపణలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తనకూ, తన కుటుంబానికి ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. 2026 జూలై 26న అందిన ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 69, 351(2) కింద ఎఫ్‌ఐఆర్ (FIR 589/2026) నమోదు చేసి, కేసు విచారణను ఎస్‌ఐపీ నరసింగరావుకు అప్పగించారు. కాగా, ఈ ఆరోపణల నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment