టాలీవుడ్ హిస్టరీలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక పెద్ద విధ్వంసానికి టైం సెట్ అయింది. రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే అల్టిమేట్ గుడ్ న్యూస్ వచ్చేసింది. మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi) అఫీషియల్ రిలీజ్ డేట్ లాక్ అయింది. ఈ ఏడాది డిసెంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి డార్లింగ్ ప్రభాస్ ‘రుద్రరూపం’ రాబోతోంది.
“అజ్ఞాత పర్వం ముగిసింది.. తిరుగుబాటు మొదలవుతోంది” అంటూ మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ వదిలిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇంతవరకు ప్రభాస్‌ను ఎప్పుడూ చూడని ఒక కంప్లీట్ డిఫరెంట్, రా అండ్ రస్టిక్ అవతారంలో చూపించారు దర్శకుడు హను రాఘవపూడి. ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది.. ఇదొక మామూలు సినిమా కాదు, వెండితెరపై ఒక ఎపిక్ వార్ అని.
వర్షంలో తడుస్తూ, ఒంటి నిండా గాయాలు, రక్తపు మరకలతో.. షర్ట్ లేకుండా ఒక బండపై కూర్చొని ఉన్నారు ప్రభాస్. ఆయన చేతిలో ఒక భారీ గన్, ఒంటిపై స్పష్టంగా కనిపిస్తున్న జంధ్యం, చుట్టూ యుద్ధభూమిలో పడి ఉన్న శవాల శిథిలాలు థ్రిల్ కలిగిస్తున్నాయి. “ఒంటిగా పోరాడే ఓ బెటాలియన్” అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమా, 1940ల నాటి హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది.
భారీ కాస్టింగ్.. అంతకు మించిన ఎమోషన్మి
లిటరీ బ్యాక్‌డ్రాప్, దేశభక్తి, ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ కలయికతో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లెజెండ్స్ మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, సీనియర్ నటి జయప్రద కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ క్లాసిక్ మ్యూజిక్ అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా విజువల్ వండర్‌గా నిర్మిస్తున్నారు.








