పవన్ కళ్యాణ్‌కు మరో శస్త్ర చికిత్స.. ముంబైలో ఆపరేషన్

పవన్ కళ్యాణ్‌కు మరో శస్త్ర చికిత్స.. ముంబైలో ఆపరేషన్

Summarize with AI

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు (Pawan Kalyan) శనివారం ముంబైలో (Mumbai) కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి (Rotator Cuff Injury) శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో (Hyderabad) ముక్కుకు (Nose) శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన, తాజాగా వైద్యుల సూచన మేరకు ముంబైలో భుజానికి ఆపరేషన్ చేయించుకున్నారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రెండు భుజాల్లోనూ తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, కండరాల చీలికలు ఉన్నాయి. రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేస్తే నొప్పి తీవ్రంగా ఉంటుందని భావించి, ప్రస్తుతం కుడి భుజానికే ఆపరేషన్ నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్సకు సుమారు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు వెల్లడించారు. మరో భుజానికి రెండు నెలల తర్వాత శస్త్ర చికిత్స చేయనున్నారు.

2016లో భుజానికి గాయమైనప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా కార్యక్రమాలు కొనసాగించార‌ని జ‌న‌సేన(Jana Sena) పేర్కొంది. పార్టీ శ్రేణులు కరచాలనం కోసం చేతులు లాగడం వల్ల గాయాలు మరింత తీవ్రతరమైనట్లు వైద్యులు తెలిపారు. ఏళ్ల తరబడి నొప్పిని భరిస్తూనే కార్యక్రమాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.

ఇటీవల ముక్కుకు శస్త్ర చికిత్సకు ముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో భుజాల గాయాలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించి, వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ ముంబైలో ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment