తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాల్గొన్న రైతు ఆశీర్వాద సభకు (Farmers’ Blessing Meeting) స్వాగతంగా ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలో (Huge Flex Banner) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఫొటో కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
మత్కేపల్లి క్రాస్ సమీపంలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy), ఇతర కాంగ్రెస్ నాయకులతో పాటు జగన్ ఫొటో కూడా ఉండటంతో సభకు వచ్చిన ప్రజల దృష్టి అంతా ఆ ఫ్లెక్సీపైనే నిలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ సభకు సంబంధించిన ఫ్లెక్సీలో జగన్(YS Jagan) చిత్రం కనిపించడం స్థానికంగా విస్తృత చర్చకు దారితీసింది.
ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలో ఉండగా, మరోవైపు పక్క రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో సభా ప్రాంగణం వద్ద హైలైట్ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది స్థానిక నాయకుల అభిమానానికి ప్రతీకనా? లేక ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశారా? అనే చర్చలు సాగుతున్నాయి.
సభకు వచ్చిన పలువురు ఆ ఫ్లెక్సీ వద్ద ఫొటోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో కూడా జగన్ పేరు, ఫొటో ఇలా హైలైట్ కావడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.







