సినిమా: లెనిన్
నటీనటులు: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, ప్రమోడ్ పంజు, ఈశ్వరీరావు, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, రాంకీ తదితరులు.
దర్శకత్వం: మురళీకిశోర్ అబ్బూరి
సంగీతం: ఎస్.ఎస్. తమన్
నిర్మాతలు: అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ
రేటింగ్: 3/5
‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని, అక్కినేని నాగార్జున – నాగవంశీ లాంటి అగ్ర నిర్మాణ సంస్థల కలయికలో అక్కినేని అఖిల్ (Akkineni Akhil) నటించిన చిత్రం ‘లెనిన్’(Lenin). రగ్గడ్ లుక్, హైప్ క్రియేట్ చేసిన ప్రమోషన్స్‌తో జూలై 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం అఖిల్‌కు మోస్ట్ అవేటెడ్ సక్సెస్ అందించిందా? లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
రాయలసీమ (చిత్తూరు జిల్లా) లోని ‘రామాపురం’(Ramapuram) అనే ఊరు. పగలు, ప్రతీకారాలు, రక్తపాతానికి దూరంగా ఉండే ప్రశాంతమైన పల్లెటూరు. ఆ ఊరిలో జరిగే ద్రౌపది అమ్మవారి జాతర సమయంలో అనాథ అయిన పదేళ్ల పిల్లాడు ‘లెనిన్’ (అఖిల్) అడుగుపెడతాడు. ఆ అనాథను ఊరి పెద్దావిడ జయంతి (ఈశ్వరీరావు) (Jayanthi) అక్కున చేర్చుకుని, తన కన్న కొడుకు వసంత్ (Vasanth) (ప్రమోద్ పంజు)తో పాటే పెంచి పెద్ద చేస్తుంది.
కట్ చేస్తే… కొన్నేళ్ల తర్వాత జైలు(Jail) నుండి విడుదలైన లెనిన్, తన సొంత ఊరిలోనే వంద మందిని నరికి చంపుతాడు. చివరికి ప్రాణస్నేహితుడైన వసంత్‌ను (Vasanth) కూడా దారుణంగా పొడుస్తాడు. అసలు రక్తం రుచే తెలియని ఆ నేలపై లెనిన్ ఎందుకు రక్తపాతం సృష్టించాడు? ప్రాణంగా చూసుకున్న స్నేహితుడినే ఎందుకు బలితీసుకున్నాడు? ఈ మహాభారతంలో (Mahabharata) అసలు విలన్ ఎవరు? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే?
దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి (Murali Kishore Abburi) ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ టెంప్లేట్‌లో, మహాభారత రిఫరెన్స్‌లతో నడిపించారు. ఈర్ష్యా, ద్వేషం, నమ్మకద్రోహం అనేవి పవిత్రమైన స్నేహాన్ని సైతం ఎలా నిర్వీర్యం చేస్తాయనే సీరియస్ సబ్జెక్ట్‌ను విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు.
ఫస్టాఫ్
సినిమా మొదటి గంట చాలా రొటీన్‌గా సాగుతుంది. జైలు నుండి హీరో రావడం, ఫ్లాష్‌బ్యాక్, హీరోయిన్ భారతి (భాగ్యశ్రీ బోర్సే)తో (Bhagyashri Borse) లవ్ ట్రాక్, డ్యూయెట్స్.. ఇలా పాత సినిమాల ఫ్లేవర్ కనిపిస్తుంది. కథలోకి వెళ్లడం ఆలస్యం కావడం వల్ల కాస్త స్లోగా అనిపిస్తుంది. అయితే ఇంటర్వెల్ ముందు వచ్చే 20 నిమిషాల ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది.
సెకండాఫ్
ద్వితీయార్థం ఊహించని మలుపులతో, షాకింగ్ ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. మంచివాళ్లుగా చలామణీ అయ్యే ‘మేకవన్నె పులుల’ అసలు రంగులు బయటపడే సీన్స్, హీరో-విలన్ మైండ్ గేమ్స్ కమర్షియల్‌గా బాగా వర్కవుట్ అయ్యాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్
ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలన్నీ ఒకెత్తు.. ‘లెనిన్’ ఒకెత్తు. అమాయకత్వం, మంచితనం, మూర్ఖత్వం కలగలిసిన పాత్రలో అఖిల్ జీవించాడనే చెప్పాలి. ముఖ్యంగా సెకండాఫ్ ఎమోషనల్ అండ్ యాక్షన్ సీన్స్‌లో తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తన అందచందాలతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. ఫస్టాఫ్‌లో హీరో-హీరోయిన్ల మధ్య డ్రామా మరికాస్త బలంగా ఉంటే ఎమోషన్స్ ఇంకా పండేవి.
వసంత్ పాత్రలో ప్రమోద్ అదరగొట్టాడు. మంచివాడిగా నటిస్తూనే క్రూరత్వాన్ని చూపించే విలనిజంలో అతని నటన సినిమాకు పెద్ద ప్లస్. ఈశ్వరీరావు జయంతి పాత్రలో ఎమోషన్స్ పండించగా.. శివాజీ, సునీల్, బ్రహ్మాజీ, రాంకీ తమ పరిధి మేరకు న్యాయం చేశారు.
- సాంకేతిక విభాగం
- మురళీకిశోర్ స్క్రీన్‌ప్లే సినిమాను నిలబెట్టింది. “పరువుని వెతుక్కున్నారు నాన్న” లాంటి పదునైన డైలాగ్స్ పేలాయి. అయితే, విలన్ అంతం మరీ సింపుల్‌గా ముగించడం, లెనిన్ జైలుకి వెళ్లిన పాయింట్‌ను బలంగా ఎస్టాబ్లిష్ చేయకపోవడం కొంత నిరాశపరుస్తుంది.
- తమన్ (Thaman) తన మార్క్ డ్రమ్స్‌తో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) హోరెత్తించాడు. ‘వారెవా.. వారెవా..’ సాంగ్ వినడానికి, స్క్రీన్‌పై చూడటానికి బాగుంది.
- 1990ల కాలాన్ని సినిమాటోగ్రఫీలో బాగా చూపించారు. విజువల్స్ రిచ్‌గా ఉన్నా, కొన్ని చోట్ల సెట్స్ అని క్లియర్ గా తెలిసిపోవడం మైనస్.
- ప్లస్ పాయింట్స్
- సెకండాఫ్ స్క్రీన్‌ప్లే & ఊహించని ట్విస్టులు
- అఖిల్ అక్కినేని కెరీర్ బెస్ట్ యాక్టింగ్
- తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM)
- మహాభారత రిఫరెన్స్ ఎలివేషన్స్
- మైనస్ పాయింట్స్
- స్లోగా సాగే ఫస్టాఫ్, రొటీన్ లవ్ స్టోరీ
- మితిమీరిన రక్తపాతం (సున్నిత మనస్కులకు ఇబ్బందే)
- క్లైమాక్స్ ఫైట్ మరీ సింపుల్‌గా ముగియడం
బాటమ్ లైన్ : యాక్షన్, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ‘లెనిన్’ పక్కాగా నచ్చుతాడు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్‌కు ఈ సినిమా ఒక పండుగ లాంటిదే.







