రూ.100 కోట్ల మోసం కేసులో కీలక మలుపు..

రూ.100 కోట్ల మోసం కేసులో కీలక మలుపు.. అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నిందితురాలి మృతి

Summarize with AI

రూ.100 కోట్లకు పైగా పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్‌బీపీఎల్)(Shares Bazaar Private Limited – SBPL), కిసాన్ పరివార్ (కేపీఎల్) (Kisan Parivar Limited – KPL) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సంస్థల డైరెక్టర్‌, ప్రిన్సిపల్ ఆఫీసర్ అట్లూరి ప్రసన్న (Atluri Prasanna) (25) అమెరికాలోని న్యూయార్క్‌ (United States New York)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

ఎన్టీఆర్ జిల్లాకు (NTR District) చెందిన ప్రసన్న ఆలయానికి వెళ్తుండగా, రెడ్ సిగ్నల్ (Red Signal) వద్ద ఆగి ఉన్న వారి కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నతో పాటు మరో యువతి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన భారీ మోసం కేసులో ప్రసన్న నిందితురాలిగా ఉండటం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది.

అల్గారిథమ్ (Algorithm) ఆధారిత స్టాక్ ట్రేడింగ్, సేంద్రియ వ్యవసాయం పేరుతో పెట్టుబడిదారులకు ఏడాదికి 18 నుంచి 48 శాతం వరకు అధిక రాబడి వస్తుందని నమ్మబలికి దేశవ్యాప్తంగా వేలాది మంది నుంచి వందల కోట్ల రూపాయలు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ మోసంలో సుమారు 6 వేల మంది పెట్టుబడిదారులు బాధితులుగా ఉన్నారని, వారిలో దాదాపు 1,500 మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిందితురాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఈ వ్యవహారంలో కొత్త మలుపుగా మారింది. అధికారులు కేసు దర్యాప్తును కొనసాగిస్తూ మిగిలిన నిందితుల పాత్రపై దృష్టి సారించారు

Join WhatsApp

Join Now

Leave a Comment