‘భూ భారతిలో రూ.10 వేల కోట్ల స్కామ్‌’.. పొంగులేటిపై ప్రవీణ్ కుమార్ సంచ‌ల‌న కామెంట్స్‌

'భూ భారతిలో రూ.10 కోట్ల స్కామ్‌'.. పొంగులేటిపై ప్రవీణ్ కుమార్ సంచ‌ల‌న కామెంట్స్‌

Summarize with AI

తెలంగాణలో(Telangana) రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) అమలు చేస్తున్న భూ భారతి పోర్టల్‌పై (Bhu Bharati Portal) బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ (R.S. Praveen Kumar) తీవ్ర ఆరోపణలు చేశారు. భూ భారతి వ్యవహారం రూ.10 వేల కోట్ల కుంభకోణంగా (Scam) మారిందని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. పోర్టల్ ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలోని రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తమ భూముల(Lands) వివరాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. భూ భారతి వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూ భారతి పోర్టల్‌లో సుమారు 22 వేల భూ బదలాయింపులు జరిగాయని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భూ యజమానులకు తెలియకుండా పోర్టల్‌లో మార్పులు చేశారని, భూముల యాజమాన్య వివరాల్లో అక్రమంగా సవరణలు జరిగాయని పేర్కొన్నారు. రైతులు వెంటనే తమ భూముల వివరాలను పరిశీలించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం దాచిపెడుతోందని కూడా ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ విమర్శించారు. కీలక శాఖలు ఇద్దరి ఆధీనంలో ఉండటంతో ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ఆరోపించారు. భూ యజమానికి సమాచారం ఇవ్వకుండా భూ బదలాయింపు జరిగే విధంగా చట్టంలో ఎలాంటి నిబంధన లేదని, అయినప్పటికీ అలాంటి మార్పులు జరిగాయని ఆరోపిస్తూ రెవెన్యూ శాఖ చట్టాలను ఉల్లంఘించిందని అన్నారు.

రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భూ భారతి పోర్టల్‌లో పెద్ద ఎత్తున మార్పులు జరిగాయని ఆయన ఆరోపించారు. 2024 నుంచి 2026 జూన్ వరకు “ఎల్లో మాఫియా గ్యాంగ్”(Yellow Mafia Gang)భూ బదలాయింపులకు పాల్పడిందని విమర్శించారు. శేరిలింగంపల్లిలో 13 గుంటల భూమిని సహస్ర ఇన్‌ఫ్రా కంపెనీకి (Sahasra Infra Company) బదలాయించారని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కలిపి 200 ఎకరాలకు పైగా భూముల బదలాయింపులు జరిగాయని ఆరోపించారు.

భూ భారతి వ్యవహారం రూ.10 వేల కోట్ల కుంభకోణంగా మారిందని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గతంలో రూ.3.95 కోట్ల అక్రమాల గురించి మంత్రి పొంగులేటి మాట్లాడారని గుర్తు చేస్తూ, ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలో అవకతవకలు జరిగాయని అన్నారు. భూ భారతి అక్రమాలపై నియమించిన అధికారుల కమిటీ నివేదికను వెంటనే ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

అధికారులతో రికార్డులు తారుమారు చేయించారని ఆరోపిస్తూ, భూ భారతి పోర్టల్‌పై స్వతంత్ర పోలీసు దర్యాప్తు ప్రారంభించాలని కోరారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన కాల్ డేటాను(Call Data) కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment