భర్త నరాల్లోకి ‘హార్పిక్’ ఎక్కించి చంపేసిన భార్య

భర్త నరాల్లోకి 'హార్పిక్' ఎక్కించి చంపేసిన భార్య

Summarize with AI

వివాహేతర సంబంధానికి (Extramarital Affair) అడ్డంగా ఉన్నాడనే నెపంతో భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను (Husband) అత్యంత క్రూరంగా హతమార్చిన ఘోర ఉదంతం నిజామాబాద్‌లో (Nizamabad) వెలుగుచూసింది. టాయిలెట్ క్లీనర్ (హార్పిక్) (Harpic) లిక్విడ్‌ను సిరంజి ద్వారా భర్త నరాల్లోకి నేరుగా ఎక్కించి ప్రాణాలు తీసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ పట్టణ శివారు ప్రాంతంలో ప్రశాంత్(Prashanth), సంధ్య (Sandhya) దంపతులు నివసిస్తున్నారు. అయితే సంధ్య కొంతకాలంగా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త ప్రశాంత్‌కు తెలియడంతో భార్య ప్రవర్తనను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. తన‌కు త‌న ప్రియుడికి మ‌ధ్య‌ అడ్డు వస్తున్న భర్తను శాశ్వతంగా వదిలించుకోవాలని సంధ్య పక్కా స్కెచ్ వేసింది.

తన పథకం ప్రకారం సంధ్య భర్త ప్రశాంత్‌కు అతిగా మద్యం (Alcohol) తాగించింది. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్న తర్వాత, తన ప్రియుడిని రహస్యంగా ఇంటికి పిలిపించింది. ఇద్దరూ కలిసి ప్రశాంత్‌పై తీవ్రంగా దాడి చేశారు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ప్రమాదంగా చిత్రీకరించేందుకు, అతడిని భవనం పై నుంచి కిందకు తోసేశారు.

భవనం పైనుంచి పడటంతో ప్రశాంత్‌కు (Prashanth) తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ అతడు ప్రాణాలతోనే కొట్టుమిట్టాడుతున్నాడు. ఎలాగైనా అతడిని చంపాలనే కసితో ఉన్న సంధ్య.. ఇంట్లో ఉన్న టాయిలెట్ క్లీనర్ (హార్పిక్) లిక్విడ్‌ను (Toilet Cleaner Harpic Liquid) ఒక సిరంజిలోకి తీసుకుంది. తీవ్ర గాయాలతో పడి ఉన్న భర్త ప్రశాంత్ నరాల్లోకి ఆ విషపూరిత కెమికల్‌ను నేరుగా ఎక్కించింది.

శరీరంలోకి అత్యంత ప్రమాదకరమైన క్లీనర్ కెమికల్ చేరడంతో, ప్రశాంత్ కొద్దిసేపటికే నరకయాతన అనుభవిస్తూ అత్యంత దారుణ స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. భార్య సంధ్యతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment