రేషన్ బియ్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో నాని పేరును ఏ6గా చేర్చారు. పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతే కేసులో పేర్ని నాని పేరును చేర్చామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పేర్ని నాని కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే.. పేర్ని నానిని అరెస్టు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్లుగా సమాచారం.
కాగా, ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని సతీమణి జయసుధకు నిన్న కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాను, తన కుటుంబం ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, రాజకీయ కక్షతోనే తన కుటుంబాన్ని వేధిస్తున్నారని పేర్ని నాని ఇటీవల మీడియాతో మాట్లాడారు.