దేశ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర.. – రాష్ట్రపతి ముర్ము

దేశ నిర్మాణంలో విద్యార్థులదే కీలక పాత్ర.. - రాష్ట్రపతి ముర్ము

ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (Andhra Pradesh Central Tribal University – APCTU) సరికొత్త చరిత్రను లిఖించింది. విశ్వవిద్యాలయం (University) ఏర్పడిన ఏడేళ్ల తర్వాత ఘనంగా నిర్వహించిన ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు భారత గౌరవ రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం విశాఖలో (Visakhapatnam) జరిగిన ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలను అందజేశారు. ఈ వేడుకలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan), ఏపీ మంత్రులు, రాష్ట్ర గవర్నర్ (Governor) అబ్దుల్ నజీర్ (S. Abdul Nazeer) తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ స్నాతకోత్సవంలో విశ్వవిద్యాలయానికి చెందిన మొత్తం 373 మంది విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సర్టిఫికెట్లను (Certificates) అందజేశారు. వీరితో పాటు విద్యాభ్యాసంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ (Gold Medals) ప్రదానం చేసి అభినందించారు.

దేశ నిర్మాణంలో మీదే పాత్ర..
భారతదేశ భవిష్యత్తులో కీలక భూమిక పోషించేది నేటి యువ విద్యార్థులేన‌ని రాష్ట్ర‌ప‌తి అన్నారు. ఒక మారుమూల గ్రామం నుండి వచ్చిన తాను.. త‌మ‌ గ్రామం నుండి మొదటి గ్రాడ్యుయేట్‌ను అని, ఈరోజు ఉన్నత చదువులు చదివిన యువతకు డిగ్రీ పట్టాలు (Degrees అందించడం త‌నకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. “మీరు జీవితంలో ఎంత ఉన్నత స్థానాలకు ఎదిగినా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అక్కడ నేటికీ అభివృద్ధి కోసం, సహాయం కోసం ఎదురుచూస్తున్న అట్టడుగు, వెనుకబడిన వర్గాల ప్రజలు కనిపిస్తారు. వారిని ప్రోత్సహించడంలో, వారి అభివృద్ధిలో మీ సహకారం చాలా అవసరం” అని సూచించారు.

భారతదేశాన్ని ‘వికాసిత్ భారత్’ (Viksit Bharat – Developed India) గా మార్చాలనే లక్ష్య సాధనలో విద్యావంతుల పాత్ర ఎంతో కీలకం అని రాష్ట్ర‌ప‌తి చెప్పారు. దేశ మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం (Dr. A.P.J. Abdul Kalam) జీవితం మనందరికీ, ముఖ్యంగా విద్యార్థి లోకానికి నిరంతరం ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment