టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్లలో ఒకటైన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, చిత్ర యూనిట్ ఒక పవర్ఫుల్ అఫీషియల్ పోస్టర్‌ను (Official Poster) విడుదల చేసింది.
ఎన్టీఆర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్‌కు ఆయన ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. “ది సన్ ఆఫ్ శివ, ది ప్రైడ్ ఆఫ్ పార్వతి, ది ఎటర్నల్ కమాండర్ అండ్ వన్స్ అగైన్ విత్ త్రివిక్రమ్” అంటూ తారక్ పోస్ట్ చేశారు.
పోస్టర్లో యుద్ధభూమిలో నిటారుగా ఉన్న ఒక భారీ త్రిశూలం (Trishul) కనిపిస్తోంది. అయితే నిశితంగా గమనిస్తే.. ఆ త్రిశూలానికి డీఎన్ఏ (DNA) ఆకారం లింక్ అయి ఉండటం అందరినీ ఆకట్టుకుంటోంది. పౌరాణిక అంశాలకు, ఆధునిక జన్యుశాస్త్రానికి (Genetics) ముడిపెడుతూ త్రివిక్రమ్ (Trivikram) ఏదో పెద్ద ప్రయోగమే చేయబోతున్నట్లు ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.
హారిక హాసిని క్రియేషన్స్ (Haarika & Hassine Creations) బ్యానర్‌పై రాధాకృష్ణ (చిన్నబాబు) (S. Radha Krishna (Chinababu) ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో నిర్మాత నాగవంశీ (Naga Vamsi) ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు.. ఇది లార్డ్ మురుగన్ (Lord Murugan) (కుమారస్వామి/సుబ్రహ్మణ్య స్వామి) కథ ఆధారంగా, తల్లి-కొడుకు ఎమోషన్‌తో సాగే పీరియాడిక్ మైథలాజికల్ సినిమా అని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్.
గతంలో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ (Jr. NTR-Trivikram Srinivas) కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత వీరరాఘవ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందించబోతున్నారు. ‘దేవర’ లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్-అనిరుధ్ కాంబో రిపీట్ అవుతుండటం ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అని చెప్పాలి.
ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.









బీరు హెల్దీ డ్రింకా?.. ‘బీచ్ షాక్స్’ కోసం నేతల తిప్పలు