ఆ హీరోనే టార్గెట్ చేశారా? అనంత్ శ్రీరామ్ కామెంట్స్‌పై ట్రోలింగ్‌

ఆ హీరోనే టార్గెట్ చేశారా? అనంత్ శ్రీరామ్ కామెంట్స్‌పై ట్రోలింగ్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 420 కోట్ల కలెక్షన్ల సునామీతో దూసుకుపోతోంది. ఈ మెగా బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో అత్యంత వైభవంగా నిర్వహించారు. అంతా బాగానే ఉంది కానీ.. ఈ వేదికపై ప్రముఖ స్టార్ లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ చేసిన కొన్ని ‘హాట్ కామెంట్స్’ ఇప్పుడు నందమూరి, మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధానికే దారితీశాయి.

స్టేజ్ ఎక్కిన అనంత్ శ్రీరామ్ తనదైన ప్రాసలతో ‘పెద్ది’ వసూళ్ల ప్రభంజనాన్ని పొగుడుతూనే, యాంటీ ఫ్యాన్స్‌కు గట్టి కౌంటర్లు ఇచ్చారు.

“పెద్ది మూవీ రూ. 420 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇది కదా వసూళ్ల వరద అంటే! ఈ వరద మీద బురద చల్లాలనుకున్న ‘దురద గాళ్ల సరదా’ తీర్చేసిన అభిమానులు మీరు. ఏదో భారీ వాహనాలను గాల్లోకి లేపితే వచ్చే చప్పట్లు కొట్టడం కాదు.. కథ మొత్తం చూసి, కళ్లలో నీళ్లు పెట్టుకుని, కుర్చీలోంచి లేచి మరీ చప్పట్లు కొట్టిన నిజమైన అభిమానులు మీరు!” అంటూ ఫ్యాన్స్‌ను ఆకాశానికెత్తేశారు.

అనంత్ శ్రీరామ్ స్పీచ్ ముగిసిందో లేదో.. తెలుగు సినిమాలో సుమోలను, భారీ వాహనాలను, ట్రైన్లను గాల్లోకి లేపే ‘హై-వోల్టేజ్’ యాక్షన్ సీన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది వన్ అండ్ ఓన్లీ బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్. దీంతో బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేశారని, వారినే మైండ్ లో పెట్టుకుని అనంత్ శ్రీరామ్ ఈ ‘దురద గాళ్లు’ అనే ఘాటు పదాన్ని వాడారంటూ ఫిలిం నగర్‌లో గట్టిగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతానికైతే ఈ ఇష్యూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా రన్ అవుతోంది. మరి కేవలం ప్రాస కోసం అనంత్ శ్రీరామ్ ఆ మాటలన్నారా? లేక నిజంగానే ‘పెద్ది’ సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వారిని టార్గెట్ చేస్తూనే ఈ రేంజ్ లో కడిగేశారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఈ వివాదం, నెట్టింట జరుగుతున్న ట్రోలింగ్స్ పై అనంత్ శ్రీరామ్ ఎలా స్పందిస్తారో, ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment