ఐపీఎల్ 2026లో వైభవ్ విలువ రూ.35 కోట్లు!

ఐపీఎల్ 2026లో వైభవ్ విలువ రూ.35 కోట్లు!

ఐపీఎల్‌లో ఆటగాళ్ల అసలు విలువను నిర్ణయించేది పేరు కాదు.. ప్రదర్శనే అని మరోసారి నిరూపించాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ కేవలం రూ.1.10 కోట్లకు దక్కించుకున్న ఈ యువ బ్యాటర్, ఐపీఎల్ 2026 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 237.31 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లఅపై విరుచుకుపడిన వైభవ్ ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో పాటు 72 సిక్సర్లు బాదుతూ మ్యాచ్‌లను ఒంటిచేత్తో మలుపు తిప్పాడు. అతడి దూకుడు బ్యాటింగ్ కారణంగా రాజస్థాన్‌కు అనేక కీలక విజయాలు దక్కగా, అభిమానులు అతడిని ‘బేబీ బాస్’ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

మరోవైపు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన రిషభ్ పంత్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. రెండు సీజన్ల తర్వాత అతడు రూ.15 కోట్లకే ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి చేరడం చర్చనీయాంశంగా మారింది. విశ్లేషణాత్మక గణాంకాల ప్రకారం వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన విలువ దాదాపు రూ.35 కోట్లకు సమానమని అంచనా వేయగా, అతడి ఇంపాక్ట్ స్కోర్ 2490.35గా నమోదైంది. దీంతో ‘ఐపీఎల్‌లో తదుపరి రూ.30 కోట్ల ప్లస్ స్టార్ ఎవరైనా ఉంటే అది వైభవ్ సూర్యవంశీయే’ అంటూ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment