ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లక్నోలో(Lucknow) సోమవారం మధ్యాహ్నం భారీ విషాదం చోటుచేసుకుంది. ఆలిగంజ్ (Aliganj) ప్రాంతంలోని పూర్ణియా కూడలి వద్ద ఉన్న ఒక కోచింగ్ సెంటర్ (Coaching Centre) భవనంలో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదంలో భవనం లోపల ఉన్న విద్యార్థులు(Students), సిబ్బందితో కలిపి మొత్తం 12 మంది మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. మరికొంతమందికి తీవ్ర గాయాలవగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సదరు మూడంతస్తుల కమర్షియల్ భవనంలో లైబ్రరీ (Library) మరియు కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (Computer Training Institute) నడుస్తున్నాయి. మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో భవనంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పురవ్వలు ఎగసిపడి, క్షణాల వ్యవధిలోనే దట్టమైన పొగ, మంటలు భవనం మొత్తాన్ని కమ్మేసాయి. భవనానికి సరైన అత్యవసర నిష్క్రమణ మార్గాలు లేకపోవడంతో లోపల ఉన్నవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పలువురు విద్యార్థులు రెండవ అంతస్తు కిటికీలు, పైకప్పుల నుండి కిందకు దూకారు. ఈ క్రమంలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు(Police), విపత్తు నిర్వహణ బృందాలు, 14 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్ వాహనాల (Hydraulic Platform Vehicles) సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. భవనం లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో లోపలికి వెళ్లడం రెస్క్యూ సిబ్బందికి కష్టంగా మారింది. దీంతో మొదటి అంతస్తు గోడలను పగలగొట్టి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ల సహాయంతో పొగను బయటకు పంపుతూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు.








జనసేన ఎమ్మెల్యే నోటి దురుసు.. వైసీపీ ఎమ్మెల్సీ సవాల్