భారత్-ఏ(India-A), శ్రీలంక-ఏ (Sri Lanka A), ఆఫ్ఘనిస్తాన్-ఏ (Afghanistan A) జట్ల మధ్య జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్‌కు(Final) రంగం సిద్ధమైంది. దంబుల్లా (Dambulla) వేదికగా జరగనున్న ఈ కీలక పోరులో అందరి దృష్టి భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే (Vaibhav Suryavanshi) ఉంది. ఐపీఎల్‌లో(IPL) అద్భుత ప్రదర్శనతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వైభవ్.. ఈ టోర్నీలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 109 పరుగులు మాత్రమే చేయగలిగిన అతడు, ముఖ్యంగా శ్రీలంక-ఏ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడ్డాడు. దీంతో ఫైనల్ మ్యాచ్ అతడి కెరీర్‌లో మరో కీలక మలుపుగా మారింది.
ఒకవేళ ఫైనల్లో కూడా వైభవ్ విఫలమైతే సెలక్టర్ల దృష్టిలో అతని స్థానం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఐపీఎల్ 2026లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులు, 72 సిక్సర్లతో సంచలనం సృష్టించిన ఈ యువ బ్యాటర్‌పై బీసీసీఐ(BCCI) ఇంకా భారీ ఆశలే పెట్టుకుంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir), చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కూడా అతని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. దంబుల్లా ఫైనల్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడితే విమర్శలకు సమాధానం చెప్పడంతో పాటు తన ప్రతిభను మరోసారి నిరూపించుకునే అవకాశం వైభవ్‌కు దక్కనుంది.









బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర