చింతమనేని వీరంగం కేసులో బాధితుడిపైనే వేటు

చింతమనేని వీరంగం కేసులో బాధితుడిపైనే వేటు

Summarize with AI

దెందులూరు (Denduluru) టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) అర్ధరాత్రి సృష్టించిన బీభత్సం ఉదంతంలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అరాచకాన్ని ప్రశ్నించిన బాధితుడికే అధికార పార్టీ షాక్ ఇచ్చింది. చింతమనేని అవినీతిని (Corruption) ఎండగట్టినందుకు.. ఆయన దాడికి గురైన సొంత పార్టీ సీనియర్ నేత, అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాస్‌పై (Edupuganti Srinivas) తెలుగుదేశం పార్టీ (TDP) సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే నెపంతో శ్రీనివాస్‌ను సస్పెండ్ (Suspend) చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించడం కొసమెరుపు.

అర్ధరాత్రి వేళ 11 గంటల సమయంలో చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి ఈడుపుగంటి శ్రీనివాస్ నివాసాన్ని ముట్టడించి, చంపుతామంటూ నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సైతం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దాడికి యత్నించిన, బూతులు తిడుతూ రెచ్చిపోయిన ఎమ్మెల్యే చింతమనేనిని పోలీసులు సురక్షితంగా ఆయన ఇంటికి సాగనంపారు. ప్రాణభయంతో వణికిపోయిన బాధితుడు ఈడుపుగంటి శ్రీనివాస్‌తో పాటు ఆయన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడం సంచలనంగా మారింది.

నా భర్తను, కొడుకును చంపాలని చూస్తున్నారు – శ్రీనివాస్ భార్య
పోలీసుల పక్షపాత వైఖరిపై, అధికార పార్టీ అండతో చింతమనేని చేస్తున్న అరాచకాలపై ఈడుపుగంటి శ్రీనివాస్ భార్య తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. “నా భర్తను, నా కొడుకును అర్ధరాత్రి పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వేశారు. నడిరోడ్డుపై తాగి ఊగుతూ మా ఇంటిపైకి దాడికి వచ్చిన చింతమనేనిని మాత్రం గౌరవంగా ఇంటికి తీసుకెళ్లారు. నా భర్త, నా కొడుకుతో పాటు నన్ను కూడా చంపాలని చూస్తున్నారు. మాకు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. మాకు న్యాయం కావాలి అని ఈడుపుగంటి శ్రీనివాస్ భార్య క‌న్నీరు పెట్టుకున్నారు.

గతంలో చింతమనేని ప్రభాకర్‌కు వ్యక్తిగత న్యాయవాదిగా (లాయర్) వ్యవహరించిన శ్రీనివాస్.. ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించినందుకు ఈ గతి పట్టడంపై స్థానిక అడ్వ‌కేట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన ఎమ్మెల్యేను వెనకేసుకొస్తూ.. బాధితుడిపైనే సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మహిళా అధికారి వనజాక్షిపై దాడి చేసినప్పుడు కూడా ఇలాగే వెనకేసుకొచ్చారని, ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ప్రవర్తించడం కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment