190 అణ్వాయుధాలతో భారత్.. SIPRI రిపోర్ట్!

190 అణ్వాయుధాలతో భారత్.. తొలిసారి వ్యూహాత్మక మోహరింపుపై SIPRI రిపోర్ట్!

భారత్ (India) అణ్వాయుధ (Nuclear Weapons) వ్యూహంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయనే అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారతదేశం తొలిసారిగా 12 అణు వార్‌హెడ్‌లను (Nuclear Warheads) వ్యూహాత్మకంగా మోహరించినట్లు పేర్కొంది.

ఇప్పటి వరకు అణ్వాయుధాలు, వాటిని ప్రయోగించే క్షిపణులను (Missiles) వేర్వేరు నిల్వ కేంద్రాల్లో భద్రపరిచే విధానాన్ని అనుసరించిన భారత్, ఇప్పుడు కొన్ని అణ్వాయుధాలను (Nuclear Weapons) నేరుగా కార్యాచరణకు సిద్ధంగా ఉంచినట్లు నివేదిక వెల్లడించింది. దీంతో భారత రక్షణ సంసిద్ధత కొత్త స్థాయికి చేరుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

SIPRI అంచనాల ప్రకారం 2026 నాటికి భారతదేశం వద్ద మొత్తం 190 అణ్వాయుధాలు (Nuclear Weapons) ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని భూతల, వైమానిక, సముద్ర ఆధారిత రక్షణ వ్యవస్థలతో అనుసంధానించబడి ఉన్నాయని నివేదిక పేర్కొంది. అయితే అణు సామర్థ్యాన్ని పెంచుకుంటున్నప్పటికీ, భారత్ తన “నో ఫస్ట్ యూజ్”(No First Use) విధానానికే కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

అంటే శత్రుదేశం ముందుగా అణుదాడి చేసినప్పుడే ప్రతీకార చర్యగా అణ్వాయుధాలను ఉపయోగించే విధానాన్ని కొనసాగిస్తోంది. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై, వ్యూహాత్మక సమతుల్యతపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment