దిగొచ్చిన ‘పెద్ది’ టీమ్.. డైరెక్ట‌ర్ క్ష‌మాప‌ణ‌లు

నెటిజన్ల ఆగ్రహానికి లొంగిన ‘పెద్ది’ టీమ్.. డైరెక్ట‌ర్ క్ష‌మాప‌ణ‌లు

‘పెద్ది’ (Peddi)హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పాత్ర చిత్రణపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. హీరోయిన్‌ను కేవలం గ్లామర్ వస్తువుగా (Objectification) చూపించారంటూ వస్తున్న నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌పై (Negative Feedback) దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) తక్షణమే స్పందించారు. నెటిజన్ల అభ్యంతరాలను గౌరవిస్తూ ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పడమే కాకుండా, ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సినిమాలోని ఒక సన్నివేశంలో హీరో రామ్ చరణ్ (Ram Charan) హీరోయిన్ జాన్వీ కపూర్ అందాన్ని పొగుడుతుంటాడు. అయితే, హీరో డైలాగులు ఒకలా ఉంటే.. స్క్రీన్ పై కెమెరా యాంగిల్స్ మాత్రం జాన్వీ శరీర భాగాలను (Body Parts) అభ్యంతరకరంగా చూపిస్తున్నట్లు ఉన్నాయని నెటిజన్లు మండిపడ్డారు. ఈ ఒక్క సీనే కాకుండా, సినిమాలో మరో రెండు చోట్ల కూడా జాన్వీ కపూర్‌ను కేవలం గ్లామర్ డాల్‌గా, అసౌకర్యంగా అనిపించే యాంగిల్స్‌లో చూపించారంటూ ఆన్‌లైన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి సీన్లు పెట్టడం ఏంటని ప్రేక్షకులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు.

విషయం తీవ్రతను గమనించిన దర్శకుడు బుచ్చిబాబు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా రంగంలోకి దిగారు. ఈ వివాదంపై స్పందిస్తూ ఆయన హుందాగా క్షమాపణలు (Apologies) కోరారు. “మా సినిమాలో ఏ మహిళా పాత్రను కూడా తక్కువ చేసి చూపించాలనేది మా ఉద్దేశం కాదు. కానీ, స్క్రీన్ పై ఆ సన్నివేశాలు ప్రేక్షకులను అసౌకర్యానికి గురిచేసాయన్న విమర్శలను మేం పూర్తిగా గౌరవిస్తున్నాం. ప్రేక్షకుల ఆందోళనను అర్థం చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం” అని బుచ్చిబాబు ప్రకటించారు.

కేవలం క్షమాపణలతోనే (Apologies) సరిపెట్టకుండా, ఆ అభ్యంతరకర సన్నివేశాలను సినిమా నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విమర్శలు ఎదుర్కొంటున్న ఆ మూడు సీన్లను ఎడిట్ చేసి, కొత్త వెర్షన్‌ను త్వరలోనే థియేటర్లలో అప్‌లోడ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment