తెలుగు తేజం కోనేరు హంపి వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను సొంతం చేసుకున్నారు. ఈ టోర్నీలో ఆమె 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెనె సుఖందర్పై విజయం సాధించిన హంపి, 2019లో కూడా టైటిల్ సొంతం చేసుకున్న విజయం తెలిసిందే. ఈ విజయంతో కోనేరు హంపి, చైనాకు చెందిన గ్రాండ్ మాస్టర్ జు వెంజన్ తర్వాత ఎక్కువ సార్లు రాపిడ్ చెస్ టైటిల్ గెలిచిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది. మెన్స్ విభాగంలో రష్యా ప్లేయర్ మర్జిన్ తన ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్నారు.
తెలుగు తేజం కోనేరు హంపి.. వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్








