విద్యావ్యవస్థను ప్రభుత్వం గాలికి వదిలేసింది – హరీశ్ రావు

విద్యావ్యవస్థను ప్రభుత్వం గాలికి వదిలేసింది - హరీశ్ రావు

రేవంత్‌ ప్రభుత్వం (Revanth Government) రాష్ట్ర విద్యావ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Tanneeru Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. సిద్దిపేట జిల్లా (Siddipet District) కేంద్రంలో నిర్వహించిన విద్యాశాఖ అధికారి (Education Department Officer) పదవీ విరమణ (Retirement Function) కార్యక్రమానికి హాజరైన ఆయన, రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉన్నప్పటికీ కేవలం 3 మంది మాత్రమే రెగ్యులర్ జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓలు)(DEOs) పనిచేస్తున్నారని, మిగిలిన 30 జిల్లాల్లో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయని హరీశ్ రావు తెలిపారు. ఈ పరిస్థితి విద్యా పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.

అదనపు కలెక్టర్లు (Additional Collectors), జాయింట్ కలెక్టర్లు (Joint Collectors, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారులు (CEOs), ఐఏఎస్ అధికారులకు (IAS Officers) డీఈఓల(DEOs) అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల వారు విద్యారంగంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ డీఈఓలను నియమించి విద్యాశాఖను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.

పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేయడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.

ఉపాధ్యాయులకు (Teachers) చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు, డీఏ(DA) బకాయిల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడం విచారకరమని అన్నారు. అలాగే పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు అందుతాయో తెలియని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు.

విద్యారంగ సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని కోరిన హరీశ్ రావు, విద్యావ్యవస్థను (Education System) నిర్లక్ష్యం (Neglect) చేయడం వల్ల భవిష్యత్ తరాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment