జనసేన నేత బూతు పురాణం.. ప్రెస్‌మీట్‌లోనే తిరగబడ్డ జర్నలిస్టులు (Video)

జనసేన నేత బూతు పురాణం.. ప్రెస్‌మీట్‌లోనే తిరగబడ్డ జర్నలిస్టులు (Video)

తెలంగాణ (Telangana) జనసేన పార్టీ (Janasena Party) మీడియా సమావేశంలో (Media Meeting) ఊహించని విధంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రెస్‌మీట్ వేదికగా జనసేన పార్టీ తెలంగాణ నాయకుడు సంపత్ నాయక్ (Sampath Naik).. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిపై (Pasham Yadagiri) తీవ్రస్థాయిలో నోరుపారేసుకోవడమే కాకుండా అసభ్యకర పదజాలంతో (Abusive Language) బూతుల పురాణం అందుకోవడం తీవ్ర దుమారం రేపింది. జనసేన నేత ప్రవర్తనతో ఆగ్రహం వ్యక్తం చేసిన జర్నలిస్టులు ప్రెస్‌మీట్ జరుగుతుండగానే ఒక్కసారిగా తిరగబడ్డారు. ఒక వైపు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సంస్కారవంతమైన రాజకీయం చేస్తామని చెబుతుంటే.. ఆ పార్టీ నేతలు విలేకరులపై బూతులతో రెచ్చిపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘ఏందిరా ఈ పెళ్ళిళ్ళ గోల?’..
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, పెళ్లిళ్లపై (Marriages) వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ సంపత్ నాయక్ అత్యంత దారుణంగా స్పందించారు. “అరేయ్.. పాశం యాదగిరి నీ బాధ ఏందిరా? ఏందిరా ఈ పెళ్ళిళ్ళ గోల? ప్రతిసారి ఈ ము*డా కొడుకులకు.. అరే మగాడు చేసుకున్నాడు రా బాయ్.. బాజాప్తా చెప్తున్నా.. ఏందిరా మీ బాధ?” అంటూ అత్యంత దారుణంగా, బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఒక సీనియర్ జర్నలిస్ట్‌ను (Senior Journalist) ఉద్దేశించి మీడియా సాక్షిగా ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం జ‌ర్న‌లిస్టుల‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంపత్ నాయక్ వ్యాఖ్యలు పూర్తి కాకముందే.. సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌ హాల్లో (Somajiguda Press Club) ఉన్న జర్నలిస్టులంతా ఒక్కసారిగా లేచి నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రశ్నించే హక్కు ఉన్న మీడియాపై, సీనియర్ విలేకరిపై ఇలాంటి నీచమైన భాషను ఎలా వాడుతారంటూ జనసేన నేతలను నిలదీశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మరో జనసేన నేత సాగర్‌కు, జర్నలిస్టులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జర్నలిస్టులు తగ్గేదేలేదంటూ జనసేన నేతల తీరుపై అక్కడికక్కడే ఆందోళనకు దిగారు.

ప్రెస్‌మీట్ ముగిసిన తర్వాత కూడా జర్నలిస్టుల ఆగ్రహం చల్లారలేదు. హాల్‌ బయటకు వస్తున్న జనసేన నాయకులను మీడియా ప్రతినిధులు (Media Representatives) నలువైపులా చుట్టుముట్టారు. తాము చేసిన వ్యాఖ్యలకు, వాడిన బూతులకు తక్షణమే క్షమాపణ (Apology) చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వారి ఆగ్రహాన్ని తట్టుకోలేక జనసేన తెలంగాణ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment