ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) జరుగుతున్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ‘మహానాడు'(Mahanadu) వేదికగా తెలంగాణపై (Telangana) టీటీడీపీ (TTDP) నేత బక్కని నరసింహులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. డిక్షనరీలో ‘తెలంగాణ'(Telangana) అనే పదమే లేదంటూ బక్కని చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బక్కని నర్సింహులు వ్యాఖ్యలు తీవ్ర అహంకార పూరితమైనవని, తెలంగాణ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.
బక్కని నర్సింహులు (Bakkani Narsimhulu) చేసిన వ్యాఖ్యలపై జీవన్ రెడ్డి మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. “బక్కని నరసింహులు ఒక తెలంగాణ బిడ్డ అయి ఉండి, ఈ గడ్డపై పుట్టి పెరిగి.. ‘డిక్షనరీలో తెలంగాణ పదం లేదు’ అనడం శోచనీయం. ఇది ముమ్మాటికీ టీడీపీ(TDP) అహంకార పూరిత చర్యలకు, వారి నైజానికి నిదర్శనం” అని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడుస్తున్నప్పటికీ, నేటికీ టీడీపీ నేతలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఇక్కడి అస్తిత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.
ఈ వివాదాస్పద వ్యాఖ్యల వెనుక టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పరోక్ష ప్రేరణ ఉందని జీవన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు మెప్పు కోసమే బక్కని ఇలా మాట్లాడారని విమర్శించారు. “చంద్రబాబు నాయుడుకు నిజంగా తెలంగాణపై గౌరవం ఉంటే.. వెంటనే బక్కని నరసింహులు చేసిన వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించాలి. ఒకవేళ చంద్రబాబు ఈ వ్యాఖ్యలను ఖండించకపోతే.. ఇవి బక్కని వ్యక్తిగత వ్యాఖ్యలు కావు, చంద్రబాబు అంతర్గత అభిప్రాయాలేనని మేము భావించాల్సి ఉంటుంది” అని స్పష్టం చేశారు.
ఒకవేళ ఈ వ్యాఖ్యలపై టీడీపీ నాయకత్వం క్షమాపణలు చెప్పకుండా, ఖండించకుండా మౌనం వహిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు గానూ.. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఎవరున్నా, ఆ పార్టీతో ఏ రూపంలోనైనా సంబంధాలు కొనసాగించే వారిని ఇక్కడి సమాజం నుంచి వెలివేస్తామని తీవ్రమైన ‘మాస్ వార్నింగ్’ ఇచ్చారు.








జనసేన నేత బూతు పురాణం.. ప్రెస్మీట్లోనే తిరగబడ్డ జర్నలిస్టులు (Video)