కిడ్నీ బాధితుడి ప్రాణం తీసిన టీడీపీ నేత ఫిర్యాదు

కిడ్నీ బాధితుడి ప్రాణం తీసిన టీడీపీ నేత ఫిర్యాదు

Summarize with AI

రాజకీయ కక్షసాధింపులు ఓ నిరుపేద ప్రాణాన్ని బలిగొన్నాయి. తమ పార్టీకి అనుకూలంగా లేరనే నెపంతో ఓ అధికార పార్టీ నాయకుడు చేసిన కుట్రపూరిత ఫిర్యాదు, దానికి తోడు అధికారుల నిర్లక్ష్యం కలిసి ఏడేళ్లుగా పింఛన్‌పైనే (Pension) ఆధారపడి బతుకుతున్న ఓ కిడ్నీ బాధితుడిని (Kidney Patient) పొట్టనబెట్టుకున్నాయి. మందులకు డబ్బుల్లేక, చేతికొచ్చే పింఛను ఆగిపోయిందనే తీవ్ర మనోవేదనతో గుంటూరు జిల్లా (Guntur District) వట్టిచెరుకూరు మండలం కారంపూడికి చెందిన సంధు వెంకటేశ్వరరావు (Sandhu Venkateswara Rao) (45) బుధవారం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాలు విడిచాడు.

మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సంధు వెంకటేశ్వరరావుకు 2019లో రెండు కిడ్నీలు పాడైపోయాయి. అప్పటి నుంచి ఆయన డయాలసిస్ (Dialysis) చేయించుకుంటూ ప్రాణాలు వెళ్లదీస్తున్నాడు. గత ఏడేళ్లుగా ప్రభుత్వం నుంచి డయాలసిస్ రోగులకు ఇచ్చే రూ.10 వేల పింఛన్‌ను పొందుతూ, ఆ డబ్బుతోనే మందులు కొనుగోలు చేస్తున్నాడు. కుటుంబ వివాదాల వల్ల భార్య, ఇద్దరు కుమార్తెలు దూరమవ్వడంతో.. వెంకటేశ్వరరావు కొన్ని రోజులు గుంటూరులో, మరికొన్ని రోజులు పొన్నూరు సమీపంలోని కసుకూరులో తన వృద్ధురాలైన తల్లి శివమ్మ (Mother Shivamma) వద్ద ఉంటూ చికిత్స పొందుతున్నాడు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటు వేయరనే అనుమానంతో కారంపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు టి.శ్రీనివాసరావు (T. Srinivasa Rao) అమానుషత్వానికి తెరలేపాడు. గ్రామానికి చెందిన సంధు వెంకటేశ్వరరావుతో పాటు కొండపల్లి అంకమ్మరావు, సంధు కృష్ణయ్య, తోటకూర రామారావు, మాదాసు సాంబయ్య, కొండపల్లి వెంకటసుబ్బారావు అనే ఆరుగురు అక్రమంగా పింఛన్లు పొందుతున్నారంటూ గతనెల 29న స్థానిక ఎంపీడీవోకి ఫిర్యాదు చేశాడు.

ఈ విషయం తెలిసి వెంకటేశ్వరరావు బంధువులు సదరు టీడీపీ(TDP) నాయకుడి వద్దకు వెళ్లి.. ఆయన కిడ్నీల వ్యాధితో నరకం అనుభవిస్తున్నాడని, పింఛను ఆపొద్దని కాళ్లు పట్టుకుని బతిమాలినా ఆయన మనసు కరగలేదు. ఉన్నతాధికారులు కూడా కనీస మానవత్వం చూపకుండా, విచారణ పేరుతో ఆ ఆరుగురి మే నెల పింఛనును తక్షణమే నిలిపివేశారు.

మందుల్లేక.. మనోవేదనతో ప్రాణం పోయింది
సకాలంలో అందాల్సిన పింఛను నిలిచిపోవడంతో వెంకటేశ్వరరావు మందులు కొనుక్కోవడానికి డబ్బుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. చేతిలో రూపాయి లేక, వైద్యం ఎలా జరుగుతుందో తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అనారోగ్యం క్షీణించడంతో ఆయన్ను గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చగా, పరిస్థితి విషమించి బుధవారం తుదిశ్వాస విడిచాడు.

కలెక్టరేట్ ముట్టడి.. న్యాయం కోసం పోరాటం
వెంకటేశ్వరరావు మరణంతో ఆగ్రహించిన బంధువులు, గ్రామస్థులు ఆయన మృతదేహాన్ని అంబులెన్స్‌లో గుంటూరు కలెక్టరేట్‌కు తరలించి గేటు ఎదుట బైఠాయించారు. బాధితుడి మృతికి కారణమైన టీడీపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ సమయంలో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి (DRO) షేఖ్ ఖాజావలికి వినతిపత్రం సమర్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment