‘డ్రాగన్’ గ్లింప్స్‌తో సోషల్ మీడియా షేక్.. ఎన్టీఆర్ లుక్స్‌పై మిక్స్‌డ్ టాక్!

‘డ్రాగన్’ గ్లింప్స్‌తో సోషల్ మీడియా షేక్.. ఎన్టీఆర్ లుక్స్‌పై మిక్స్‌డ్ టాక్!

Summarize with AI

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ (Jr.NTR– Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డ్రాగన్’ (Dragon) గ్లింప్స్ (Glimpse) సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ బర్త్‌డే (NTR Birthday) సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఈ గ్లింప్స్‌లో ప్రశాంత్ నీల్ మార్క్ (Prashanth Neel Mark) ఊరమాస్ ఎలివేషన్స్, డార్క్ విజువల్స్, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ లుక్స్‌పై (NTR Looks) మాత్రం సోషల్ మీడియాలో మిక్స్‌డ్ రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, ఫేషియల్ డిజైన్ విషయంలో ఎన్టీఆర్ ఒరిజినల్ చార్మ్ కొంత మిస్సైందా? అనే చర్చ ఫ్యాన్స్‌లోనే మొదలైంది. ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్‌ను పూర్తిగా కొత్త అవతార్‌లో చూపించే ప్రయత్నం చేశారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక గ్లింప్స్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకవైపు ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ ఇది పూర్తిగా ప్రశాంత్ నీల్ స్టైల్‌లో ఉన్న వైల్డ్ మాస్ అవతార్ (Wild Mass Avatar) అంటూ హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు సాధారణ ప్రేక్షకులు మాత్రం లుక్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరమని కామెంట్స్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ తరహా టెంప్లేట్‌ను మళ్లీ రిపీట్ చేశారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ‘డ్రాగన్’ గ్లింప్స్ క్రియేట్ చేసిన హైప్ మాత్రం పీక్స్‌లోనే ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో ఎన్టీఆర్ యాక్షన్, ప్రశాంత్ నీల్ టేకింగ్ కలిసి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment