మంచు ఫ్యామిలీలో (Manchu Family) విభేదాలు ఇంకా ముగియలేదా? అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుందా? అనే చర్చ మరోసారి టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా హీరో మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ప్రీ-బర్త్‌డే సెలబ్రేషన్స్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మనోజ్.. కుటుంబ వివాదాలపై (Family Disputes) వచ్చిన ప్రశ్నకు సెటైరికల్‌గా స్పందించి అందరినీ షాక్‌కు గురిచేశారు. “ఆ విషయం గురించి ఎవరిని అడగాలో మీకే తెలుసు.. కానీ వెళ్లేటప్పుడు చేతిలో మైక్ (Mic) కాకుండా తలకు హెల్మెట్ (Helmet) పెట్టుకుని వెళ్లండి” అంటూ నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి.
మనోజ్ చేసిన ఈ ‘హెల్మెట్’ కామెంట్స్ పరోక్షంగా తన అన్నయ్య మంచు విష్ణును (Manchu Vishnu) ఉద్దేశించిందేనని నెటిజన్లు భావిస్తున్నారు. గతంలో మంచు బ్రదర్స్ మధ్య జరిగిన వివాదాలు ఎంత సంచలనం సృష్టించాయో తెలిసిందే. ఇప్పుడు మరోసారి మనోజ్ సెటైర్లు వేయడం చూస్తుంటే కుటుంబంలో ఇంకా గ్యాప్ కొనసాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఫిల్టర్ లేకుండా తనదైన స్టైల్‌లో మనోజ్ వేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఇదే హాట్ డిస్కషన్‌గా మారింది.








