IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ (Playoffs) రేసు మరింత హీట్ ఎక్కింది. ఈ నేపథ్యంలో SRH, RCB మధ్య జరగనున్న కీలక మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎస్‌ఆర్‌హెచ్(SRH) యాజమాన్యం టికెట్ ధరలను భారీగా పెంచినట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో(Rajiv Gandhi International Stadium) జరిగే ఈ మ్యాచ్ కోసం టికెట్ ధరలను(Ticket Prices) 50 శాతం నుంచి 110 శాతం వరకు పెంచినట్లు సమాచారం. మే 15 సాయంత్రం జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో(Zomato District App) టికెట్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో కొద్ది నిమిషాల్లోనే వెయిటింగ్ లిస్ట్ 2.60 లక్షలకు చేరుకోవడం మ్యాచ్ క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.
ఇప్పటివరకు రూ.950 నుంచి రూ.30 వేల వరకు ఉన్న టికెట్ ధరలు ఇప్పుడు రూ.2 వేల నుంచి రూ.45 వేల వరకు పెరగడం అభిమానులకు షాక్ ఇచ్చింది. ముఖ్యంగా సౌత్ ఫస్ట్ టెర్రస్ టికెట్ రూ.1500 నుంచి రూ.3000కు పెరగగా, అప్పర్ టియర్ స్టాండ్స్ టికెట్లు రూ.900 నుంచి రూ.2000కు చేరుకున్నాయి. ఇక కార్పొరేట్ బాక్స్ టికెట్లు ఏకంగా రూ.45 వేల వరకు వెళ్లడం హాట్‌టాపిక్‌గా మారింది. “ఐపీఎల్ మ్యాచ్ చూడాలంటే సామాన్య అభిమానులు స్టేడియానికి ఎలా రావాలి?” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు









పవన్ కళ్యాణ్ మీకిది తగునా..? విశ్లేషకుల సూటి ప్రశ్నలు