ఆన్‌లైన్ మందుల అమ్మకాలపై నిరసన.. రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీల సమ్మె

ఆన్‌లైన్ మందుల అమ్మకాలపై నిరసన.. రాష్ట్రవ్యాప్తంగా ఫార్మసీల సమ్మె

మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులు (Medical Shops) బంద్ (Bandh) కానుండటం రాష్ట్ర ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వ (Central Government) విధానాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్‌తో (Drugs Control Officers India Welfare Association) పాటు ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) సమ్మెకు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ ఈ-ఫార్మసీ కంపెనీలపై (Online E-Pharmacy Companies) తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంఘాలు, సరైన వైద్య ధృవీకరణ లేకుండా మందుల విక్రయం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. కోవిడ్ సమయంలో వచ్చిన సడలింపులను అడ్డంగా పెట్టుకుని నకిలీ మందులు, ప్రమాదకర ఔషధాలు సరఫరా అవుతున్నాయని పేర్కొంటున్నాయి. AI సాంకేతికతతో నకిలీ ప్రిస్క్రిప్షన్‌లు సృష్టించే అవకాశం ఉండటంతో యాంటీబయాటిక్స్(Antibiotics), మత్తు మందుల (Narcotic Drugs) దుర్వినియోగం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.

ఇక ఈ-ఫార్మసీ ప్లాట్‌ఫారమ్‌లు భారీ డిస్కౌంట్లతో మందులు అమ్మడం వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో స్థానిక మెడికల్ షాపులే ప్రజలకు ప్రధాన ఆధారం కావడంతో ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే అనేక చిన్న దుకాణాలు మూతపడే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో మందుల లభ్యతపై కూడా ప్రతికూల ప్రభావం పడవచ్చని AIOCD పేర్కొంది. మరోవైపు, బంద్ కారణంగా అత్యవసర మందులు కొనుగోలు చేయాల్సిన సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.

Join WhatsApp

Join Now

Leave a Comment