పశ్చిమ బెంగాల్ (West Bengal) మధ్యమిక్ (Madhyamik) (10వ తరగతి) ఫలితాలు నేడు విడుదలయ్యాయి. వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (WBBSE) ఇవాళ ఉదయం 9.30 గంటలకు విలేకరుల సమావేశం ద్వారా ఈ ఫలితాలను ప్రకటించింది.
ఈ ఏడాది మొత్తం 86.83% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఫలితాలతో పోల్చితే (86.56%) కంటే స్వల్పంగా మెరుగుపడినట్లుగా కనిపిస్తోంది. ఉత్తర దినాజ్పూర్కు (Uttar Dinajpur) చెందిన అభిరూప్ భద్ర (Abhirup Bhadra) 700 మార్కులకు గాను 698 (99.71%) మార్కులతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు. జిల్లాల వారీగా చూస్తే కాలింపాంగ్ 95.10% ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, కోల్కతా 92.31%తో ఆ తర్వాతి స్థానంలో ఉంది. మొదటి 10 ర్యాంకుల్లో రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లాల నుండి మొత్తం 131 మంది విద్యార్థులు చోటు సంపాదించుకున్నారు.
అభ్యర్థులు www.wbbsedata.com 2026 అధికారిక వెబ్సైట్ల ద్వారా తమ రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. విద్యార్థులు తమ ఒరిజినల్ మార్కు షీట్లు, సర్టిఫికెట్లను నేడు (మే 8) ఉదయం 10.30 గంటల నుండి సంబంధిత పాఠశాలల ద్వారా పొందే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 12 వరకు పదివ తరగతి పరీక్షలు జరిగాయి. సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.








