కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (Telangana Rashtra Sena – TRS) ప్రకటనపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కవిత తీరును ఉద్దేశించి ఆయన చేసిన “పిట్టల దొరసాని” (Pittala Dorasani) వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కవిత కొత్త పార్టీ ప్రకటనపై అరవింద్ స్పందిస్తూ.. “తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు ‘పిట్టల దొర’ (కేసీఆర్)(KCR)ను చూశారు, ఇకపై ‘పిట్టల దొరసాని’ (కవిత)ని చూస్తారు” అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కవితకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీయేనని, ఆమె మళ్లీ ఎన్ని పార్టీలు పెట్టినా ప్రజలు నమ్మరని అరవింద్ స్పష్టం చేశారు. కవితకు కేసీఆర్ రజనీకాంత్‌లా (Rajinikanth) కనిపిస్తున్నారా? ఆయన ఏమైనా రోబోలా మారారా? అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. ఇండియా-పాకిస్తాన్ విభజన (India-Pakistan Partition) సమయంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, తెలంగాణ విషయంలో కూడా కేసీఆర్ కుటుంబం ప్రకటనలు చేసి వెనక్కి తీసుకోవడం వల్లే అనేకమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆరోపించారు. బీజేపీ(BJP) మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం రావడం సాధ్యమయ్యేదా? అని ఆయన ప్రశ్నించారు.
తేజస్వి సూర్య వ్యాఖ్యలపై సమర్థన
బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య (Tejasvi Surya) చేసిన వ్యాఖ్యలను అరవింద్ సమర్థించారు. “తేజస్వి మాటలను బీఆర్ఎస్(BRS) కళ్లద్దాలతో చూడకండి. ఆయన వాస్తవాలే మాట్లాడారు. విభజన ప్రక్రియలో కేసీఆర్ అనుసరించిన వైఖరి వల్లే ప్రాణనష్టం జరిగిందని ఆయన ఉద్దేశం అని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు.








