అల్లు అర్జున్ – అట్లీ మూవీ టైటిల్ ఫిక్స్.. పోస్ట‌ర్ రిలీజ్‌

అల్లు అర్జున్ - అట్లీ మూవీ టైటిల్ ఫిక్స్.. పోస్ట‌ర్ రిలీజ్‌

పుష్పరాజ్ మేనియాతో ప్రపంచాన్ని ఊపేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన తదుపరి సినిమాతో మరో సంచలనానికి తెరలేపారు. కోలీవుడ్ కమర్షియల్ కింగ్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘రాకా’ (RAAKA) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

ఇంటెన్సివ్ ఫస్ట్ లుక్
రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే అట్లీ ఈసారి ఏదో పెద్ద ప్రయోగమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. తోడేలును పోలిన జంతువు ముసుగులో ఉన్న అల్లు అర్జున్ గెటప్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం చాలా భయంకరంగా, ఇంటెన్సివ్ డార్క్ థీమ్‌లో ఉంది. రొటీన్ కమర్షియల్ సినిమాల కంటే భిన్నంగా, ఒక ‘సూపర్ హీరో’ తరహా కథతో అట్లీ రాబోతున్నారని పోస్టర్ హింట్ ఇస్తోంది.

సన్ పిక్చర్స్ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. అల్లు అర్జున్ ఇమేజ్, అట్లీ టేకింగ్, దీపికా గ్లామర్.. ఇవన్నీ కలిపి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. “తగ్గేదే లే” అన్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే, అల్లు అర్జున్ మరోసారి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకోవడం పక్కా అనిపిస్తోంది. ఈ సినిమాకు యువ‌తేజం సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment