ఐకాన్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. స్టార్ట్ అయిన సెలబ్రేషన్స్!

ఐకాన్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. ఒక రోజు ముందే స్టార్ట్ అయిన సెలబ్రేషన్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ఏప్రిల్ 8 వేడుకలు ఒక రోజు ముందే మొదలయ్యాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న క్రేజీ కాంబినేషన్ – అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ సినిమాకు సంబంధించి ఈరోజు ఒక కీలక ప్రకటన వెలువడింది.

ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సినిమా టైటిల్ కు సంబంధించి ఒక భారీ అనౌన్స్‌మెంట్ చేసారు. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. రేపు (ఏప్రిల్ 8) అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో రేపు ఉదయం 11 గంటలకు టైటల్ విడుదల అంటూ ప్రకటన.

AA 22 ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు భారీ VFX ఉండబోతున్నాయని సమాచారం. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. వాటిలో ‘అయాన్’ ‘లెగసీ‘ అనే టైటిల్స్ ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జవాన్ వంటి భారీ హిట్ తర్వాత అట్లీ తీస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్‌ను ఆయన ఏ రేంజ్‌లో చూపిస్తారో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఇతర కీలక పాత్రల్లో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ కనిపిస్తారని టాక్. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ గా సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బన్నీ – అట్లీ ఎలాంటి కథతో వస్తారో ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారోనని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment