యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి.. స్టాలిన్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి.. స్టాలిన్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో జరిగిన దారుణ ఘ‌ట‌న‌ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. 19 ఏళ్ల డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు దాడి చేసి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన డిసెంబర్ 23 సాయంత్రం చోటుచేసుకోగా, నిందితులు ఈ దాడిని వీడియో తీసి బాధితురాలిని మరియు ఆమె స్నేహితుడిని బ్లాక్‌మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ ఘటన యూనివర్సిటీ క్యాంపస్‌లో జరగడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

స్టాలిన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు
ఈ దారుణంపై ప్రతిపక్షాలు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. తక్షణ చర్యలు తీసుకోవాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉంది. డీఎంకే ప్రభుత్వం మహిళల రక్షణపై ఘోరంగా విఫలమైంది” అని ఆయన ఆరోపించారు.

సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, యూనివర్సిటీలలో భద్రతను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment