ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్‌తో గుజరాత్ పోరు!

ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్‌తో గుజరాత్ పోరు!

ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌లో నేడు క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా వినోదం సిద్ధంగా ఉంది. మొదటి మ్యాచ్‌లో ఢీల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), ముంబాయు ఇండియన్స్ (Mumbai Indians) తో ఢిల్లీ (Delhi) వేదికగా ఢీకొననుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) లో ప్రారంభమయ్యే ఈ పోరు రెండు జట్లకూ కీలకంగా మారింది. సొంత మైదానం అనుకూలతతో ఢిల్లీ ఆత్మవిశ్వాసంగా బరిలోకి దిగుతుండగా, స్టార్ ఆటగాళ్లతో నిండిన ముంబై ఇండియన్స్ గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సీజన్‌లో ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లను గెలుచుకోవడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి మరింత పెరిగింది.

ఇక రాత్రి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్ధాన్ రాయల్స్ తో అహ్మదాబాద్‌లో (Ahmedabad) తలపడనుంది. ఈ మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium) లో జరుగనుండగా, హోమ్ గ్రౌండ్‌లో గుజరాత్‌కు మంచి రికార్డు ఉంది. అయితే ప్రస్తుత ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చే అవకాశముంది. ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై రాజస్థాన్ స్పిన్నర్లు ఎలా రాణిస్తారో చూడాలి. ఒకవైపు భారీ విజయంతో జోష్‌లో ఉన్న రాజస్థాన్, మరోవైపు గత మ్యాచ్‌లో ఓటమి నుంచి తిరిగి రావాలనే లక్ష్యంతో ఉన్న గుజరాత్ — ఈ పోరును మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment