రైతులకు గుడ్‌న్యూస్.. ‘రైతు భరోసా’ రెండో విడతకు ముహూర్తం

రైతులకు గుడ్‌న్యూస్.. ‘రైతు భరోసా’ రెండో విడతకు ముహూర్తం

తెలంగాణలో (Telangana) రైతులకు (Farmers) ఉపశమనం కలిగించే కీలక నిర్ణయంతో రేవంత్ సర్కార్ (Revanth Reddy) ముందుకు వచ్చింది. వేసవి సీజన్‌లో పెట్టుబడి భారం తగ్గించేందుకు ‘రైతు భరోసా’ (Rythu Bharosa Scheme) రెండో విడత నిధుల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒత్తిడిలో ఉన్నప్పటికీ, రైతు సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకున్న ప్రభుత్వం సుమారు రూ. 2,650 కోట్ల భారీ మొత్తాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, రుణ చెల్లింపులు పూర్తయ్యాక వెంటనే రైతుల ఖాతాల్లోకి ఈ సాయం జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం.

మొత్తం రూ. 9,000 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న ఈ పథకాన్ని మూడు విడతల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు మొదటి విడత అందగా, ఇప్పుడు ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఈ నెల రెండో వారంలో నగదు జమ కానుంది. ఐదు ఎకరాలకుపైగా భూమి ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా సాయం అందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి ఎకరానికి రూ. 6,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డీబీటీ(DBT) ద్వారా జమ చేయడం వల్ల ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా సాయం అందుతోంది. ఈ నిర్ణయం రైతుల్లో నూతన ఆశలు నింపుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment