తిరుపతిలో ఘోరం.. ఆకలితో ఏడుస్తున్న‌ పాపను చంపిన క‌సాయి తల్లి

తిరుపతిలో ఘోరం.. ఆకలితో ఏడుస్తున్న‌ పాపను చంపిన క‌సాయి తల్లి

ఆకలితో అలమటిస్తూ పాలు కావాలని ఏడుస్తున్న ఆరు నెలల పసికందును (Six Months Infant) కన్నతల్లే (Own Mother) కిరాత‌కంగా ప్రాణాలు తీసిన ఘటన తిరుపతి జిల్లా (Tirupati District) సత్యవేడు మండలంలో వెలుగుచూసింది. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హేమవతి (Hemavathi) అనే మహిళకు ఆరు నెలల పసిపాప ఉంది. పసికందు ఆకలితో (Hunger) నిరంతరం ఏడుస్తుండటంతో హేమవతి తీవ్ర అసహనానికి, ఆవేశానికి లోనైంది. ఆ ఆవేశంలో విచక్షణ కోల్పోయిన ఆమె, పసిపాప ఏడుపు ఆపడానికి ముక్కు, నోరు గట్టిగా మూసేసింది. ఊపిరాడక ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

“నాకు గుడ్ న్యూస్.. నీకు బ్యాడ్ న్యూస్”
బిడ్డ చనిపోయిన తర్వాత హేమవతి ప్రవర్తన పోలీసులను సైతం విస్తుపోయేలా చేసింది. పసిపాప ప్రాణం పోయాక ఏ మాత్రం చలనం లేకుండా తన భర్తకు ఫోన్ చేసింది. “ఇది నాకు గుడ్ న్యూస్.. నీకు బ్యాడ్ న్యూస్” అంటూ బిడ్డ మరణవార్తను చెప్పడంతో భర్తతో పాటు పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు హేమవతిని అదుపులోకి తీసుకుని, ఆమెపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment