ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)(IPL) ప్రపంచంలోని అత్యంత విలువైన క్రికెట్ లీగ్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో ప్రతి జట్టు ప్రత్యేక క్రేజ్‌ను కలిగిన కారణంగా, జట్ల యజమాన్యాలు కూడా అంతే శక్తివంతంగా ఉంటాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)(RCB) జట్టును ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా, బోల్ట్ వెంచర్స్, బీఎక్స్‌పీఈ-బ్లాక్‌స్టోన్ సంస్థలు కలిపి పొందగా, రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)(RR) ను ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్షియం కొనుగోలు చేసింది. ఈ మార్పులు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
ముంబై ఇండియన్స్ (ఎంఐ)(MI) జట్టు నీతా అంబానీ (Nita Ambani) ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతుల్లో ఉంది, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)(KKR) కు షారుఖ్ ఖాన్(Shah Rukh Khan), జూహీ చావ్లా(Juhi Chawla) మరియు రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ యజమాన్యం వహిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)(SRH) ను కలానిథి మారన్ (Kalanithi Maran) నేతృత్వంలోని సన్ టీవీ నెట్‌వర్క్ నిర్వర్తిస్తుంటే, పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)(PBKS) కు ప్రీతి జింటా(Preity Zinta),, వాడియా గ్రూప్, మొహిత్ బర్మన్ (Mohit Burman) సంబంధిత కెపిహెచ్ డ్రీమ్ క్రికెట్ లిమిటెడ్ యజమాన్యం ఉంది.
మిగతా జట్లు కూడా పటిష్ట యజమాన్యంతో నిలిచాయి. డిల్లీ క్యాపిటల్స్ (డీసీ)(DC) జట్టు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ పార్థ్ జిందాల్ (Parth Jindal) నేతృత్వంలో ఉంది, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) (LSG) సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka) ఆధ్వర్యంలో ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌లో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)(CSK) ఎన్. శ్రీనివాసన్ (N. Srinivasan) ఆధ్వర్యంలోని ఇండియా సిమెంట్స్ చేతుల్లో ఉంటే, గుజరాత్ టైటాన్స్ (జీటీ)(GT) జట్టును సిద్ధార్థ్ పటేల్ (Siddharth Patel) సీవిసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ నిర్వహిస్తోంది. ఈ బలమైన యాజమాన్యాల వల్లే ఐపీఎల్ ప్రపంచ స్థాయిలో అత్యంత పాపులర్, విలువైన లీగ్‌గా ఎదిగింది.








